తెరపైకి మరో బయోపిక్ వస్తోంది

0
16
Choreographer Saroj Khan on NACHLE VE WITH SAROJ KHAN. *** Local Caption *** Choreographer Saroj Khan on NACHLE VE WITH SAROJ KHAN. Express archive photo

రెమో డిసౌజా దర్శకత్వంలో సరోజ్ ఖాన్ బయోపిక్ రూపొందించాలని భావిస్తున్నారు. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ దిగ్గజం సరోజ్ ఖాన్ జులై 3 న మరణించిన విషయం తెలిసిందే . సుదీర్ఘ మైన కెరీర్ లో  2000 వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ అందించింది సరోజ్ ఖాన్. బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో అలాగే ఇతర భాషల్లో రూపొందిన చిత్రాలకు కూడా పనిచేసింది సరోజ్ ఖాన్. చిన్నప్పటి నుండే తన కుటుంబం కోసం కష్టపడింది సరోజ్ ఖాన్.  పేదరికంలో మగ్గుతున్న తన కుటుంబం కోసం డ్యాన్సర్ గా మారింది. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా ఎదిగింది.

బాలీవుడ్ లో స్టార్ హీరోలకు అందరికి డ్యాన్స్ లో మెలకువలు నేర్పించింది సరోజ్ ఖాన్. అలాగే పలువురు హీరోయిన్ లను మరింత అందంగా ఎలా డ్యాన్స్ చేయాలో నేర్పించింది. దాంతో పలువురు హీరోలు , హీరోయిన్ లకు సరోజ్ ఖాన్ అంటే చాలా చాలా ఇష్టం, గౌరవం. ఇక బయోపిక్ ల విషయానికి వస్తే…… బాలీవుడ్ లో పలు బయోపిక్ లు వచ్చాయి దాదాపుగా అన్ని బయోపిక్ లు కూడా బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. దాంతో డ్యాన్సర్ గా ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగి డైరెక్టర్ గా కూడా మారిన రెమో డిసౌజా దర్శకత్వంలో సరోజ్ ఖాన్ బయోపిక్ రూపొందనుందట.  

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి