ఆందోళన కరంగా ట్రంప్ ఆరోగ్యం

0
45
trup effected carona

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళన కరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 48 గంటల తర్వాత కానీ ట్రంప్ ఆరోగ్యం గురించి చెప్పలేమని వైద్యులు ప్రకటించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నప్పటికీ ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు మాత్రం ఇవన్నీ గాలి వార్తలే అని కొట్టిపడేసాడు. 74 సంవత్సరాల డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మొదట్లో కరోనా వైరస్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు ట్రంప్. దాంతో అమెరికా తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.

అసలే అమెరికాకు ఎన్నికలు సమీపించాయి ఇలాంటి సమయంలో ట్రంప్ కరోనాతో బాధపడుతూ ఆసుపత్రి పాలవ్వడం వల్ల ప్రత్యర్థికి మరింత బలం చేకూరేలా ఉంది. దానికి తోడు ట్రంప్ పాలన పట్ల విసిగి ఉన్న ప్రజలకు కరోనా మహమ్మారి వల్ల ట్రంప్ పట్ల మరింత వ్యతిరేకత ఏర్పడేలా చేసింది. అయితే అమెరికా ఎన్నికల సంగతి పక్కన పెడితే కరోనా ట్రంప్ ఆరోగ్యం విషమించినట్లు అతడి సన్నిహితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

74 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్ కు శ్వాసకోశ ఇబ్బంది కూడా ఉందట దాంతో ట్రంప్ కు కరోనా సోకిన వెంటనే వెంటిలేటర్ అమర్చారట. మరో రెండు రోజులు గడిస్తే కానీ ట్రంప్ ఆరోగ్యం గురించి చెప్పలేమని అన్నారట డాక్టర్లు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో కరోనా తో పెద్ద సంఖ్యలోనే జనాలు చనిపోయారు. అసలు ఒక దశలో అమెరికాలో 60 ఏళ్ళు పైబడిన వయసు వాళ్లకు కరోనా సోకితే ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకోలేని పరిస్థితి, కరోనా వచ్చిన ముసలివాళ్ళు చచ్చిపోవాల్సిందే తప్ప చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ చేసుకునే పరిస్థితి ఉండేది కాదంటే నమ్మండి అంత దారుణంగా ఉండేది పరిస్థితి. అయితే ఇప్పుడు చాలా బెటర్ అయ్యింది అమెరికాలో. డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తోంది టాలీవుడ్ మూవీ న్యూస్ .

మునుపటి వ్యాసంశ్రీ ముఖి ఫొటోస్
తదుపరి ఆర్టికల్ఎన్టీఆర్ కు కరోనా టెస్ట్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి