కన్నీళ్ల పర్యంతమైన సుమ

0
22
sumakanakala with rajeev

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యాంకర్ సుమ తాజాగా ఓ షోలో కనీళ్ళ పర్యంతం అయ్యింది. తన భర్త రాజీవ్ కనకాలని పట్టుకొని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యింది. ఆ సమయంలో సుమ కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరిగాయి. దాంతో కొద్దిసేపు అలాగే అతడ్ని పట్టుకొని ఏడ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టి తమ బంధం గురించి చెప్పకనే చెబుతోంది. సుమ ఇంతగా ఉద్వేగానికి లోను కావడానికి కారణం ఏంటో తెలుసా …….. గతకొంత కాలంగా రాజీవ్ కనకాల – సుమ విడిపోతున్నారు ……. విడిపోయారు …… దూరంగా ఉంటున్నారు అంటూ రకరకాల పుకార్లు షికార్లు చేయడమే.

యాంకర్ గా నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది సుమ. దాంతో ఎక్కువ టివి షోలతో పాటుగా పలు సినిమా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. దాంతో రాజీవ్ కనకాల – సుమ విడిపోయారు అంటూ రకరకాల పుకార్లు కొంతమంది పనిగట్టుకొని చేయడంతో వాటికి సమాధానం చెప్పలేక సతమతం అయ్యింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే క్యాష్ అనే కార్యక్రమానికి రాజీవ్ కనకాల కూడా గెస్ట్ గా రావడంతో అతడ్ని పట్టుకొని అలాగే ఉండిపోయింది.

ఉబికి వస్తున్న కన్నీళ్లని ఆపుకోవడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు కన్నీళ్లు జలజలా రాలాయి. ఇక రాజీవ్ కూడా ఎమోషనల్ అయ్యాడు దాంతో సుమని దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. అలా కొద్దిసేపు వాళ్ళు అలా ఫ్రీజ్ కావడంతో చూసేవాళ్లకు కూడా ఎమోషనల్ టచ్ ఇచ్చినట్లయింది. 45 సంవత్సరాల సుమ 21 సంవత్సరాల క్రితం రాజీవ్ కనకాల ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు. అయితే విభేదాలతో విడిపోయారు అంటూ కొంతమంది కారుకూతలు కూయడంతో అలాంటి వాళ్లకు సమాధానంగా ఇలా చెప్పింది సుమ. 

మునుపటి వ్యాసంఆర్ ఎక్స్ 100 నిర్మాత కోసం పోలీసుల గాలింపు
తదుపరి ఆర్టికల్పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన యంగ్ హీరో
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి