రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

0
61
anchore pradeep

రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్ ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడని రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవి మరింతగా తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుండటంతో ఎట్టకేలకు స్పందించాడు. అసలు ఆ రేప్ కేసులు ఏంటో నాకు తెలియదు కాని అనవసరంగా ఇందులో నన్ను ఇరికించి కొంతమంది శునకానందం పొందుతున్నారని , అసలు విషయం తెలుసుకోకుండా నన్ను , నా కుటుంబాన్ని రోడ్డుకు  ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రదీప్. నిన్న సాయంత్రం ప్రదీప్ ఓ వీడియో విడుదల చేసాడు.

అత్యాచారానికి గురైన యువతికి తప్పకుండా న్యాయం జరగాలి కానీ నాకు సంబంధం లేకుండా ఈ అత్యాచారం కేసులో నా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. మీడియా లో కూడా ఇది నిజమా ? కాదా ? అన్న ఆలోచన చేయకుండా నాపై ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రదీప్. ఓ దళిత యువతిని ఆరేళ్లుగా  బెదిరించి, వీడియోలు , ఫోటోలు బయట పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తూ 143 మంది అత్యాచారం చేశారట.

ఇన్నాళ్లకు ఆ యువతి ధైర్యం చేసి హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువతి ఇచ్చిన లిస్ట్ లో పలువురు రాజకీయ నాయకుల పీఏ లు , సినిమా వాళ్ళు , టీవీ వాళ్ళు , స్టూడెంట్ లీడర్స్ కూడా ఉన్నారట. అందులోనే యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉందని లీక్ కావడంతో మీడియాలో అదేపనిగా అతడిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఆ అత్యాచారం కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు ప్రదీప్. అయితే విచారణలో మాత్రమే అసలు నిజం తేలనుంది ప్రదీప్ కి సంబంధం ఉందా ? లేదా ? లేక మరొక ప్రదీప్ అనే వ్యక్తా అన్నది.

మునుపటి వ్యాసంప్రభాస్ రికార్డ్ ని బద్దలుకొట్టిన అల్లు అర్జున్
తదుపరి ఆర్టికల్ఇంట్లోనే శిక్షణకు సిద్ధం అవుతున్న ప్రభాస్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి