యాంకర్ ప్రదీప్ ఆశలు గల్లంతు

0
18
anchor pradeep movie delays for coronavirus

యాంకర్ ప్రదీప్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే టివి ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. రకరకాల కార్యక్రమాలతో నిత్యం మహిళా ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు ప్రదీప్. అయితే ప్రదీప్ కు హీరోగా వెలిగిపోవాలని ఆశ అందుకే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ చిత్రంలోని ” నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా ” అనే పాట పెద్ద హిట్ కూడా అయ్యింది దాంతో సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు ప్రదీప్.

కరోనా ఎఫెక్ట్ లేకపోతె ఈపాటికి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమా విడుదల అయ్యేది అలాగే హిట్టో ? ఫట్టో కూడా తెలిసిపోయేది. కానీ కరోనా పుణ్యమా అని ఆ సినిమా విడుదల ఆగిపోయింది. ఇక ఆ సినిమా విడుదల కావాలంటే ఎప్పుడో తెలియని పరిస్థితి ఎందుకంటే కరోనా ఎపుడు అదుపులోకి వస్తుందో ? తెలియదు కదా ! దాంతో ప్రదీప్ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. కరోనా అదుపులోకి వచ్చినప్పటికీ జనాలు బయట తిరగడానికి , సినిమాలకు వెళ్ళడానికి మాత్రం చాలా సమయమే పడుతుంది అప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటో ?

30 Rojullo Preminchadam Ela: Pradeep Machiraju's film to release ...

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి