యాంకర్ ప్రదీప్ కు రేప్ కేసుతో సంబంధం లేదట

0
52
anchor Pradeep

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్యాంకర్ ప్రదీప్ కు దళిత యువతిని రేప్ చేసినట్లు ఆరోపణలు రాగా ఆ ఆరోపణలు నిరాధారమని , యాంకర్ ప్రదీప్ కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టాడు మంద కృష్ణ మాదిగ. ఈరోజు సోమజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసు గురించి పలు విషయాలు వెల్లడించాడు. దళిత యువతి ని అత్యంత కిరాతకంగా కొంతమంది అత్యాచారం చేసారని , అయితే ఆ అత్యాచార నిందితుల్లో యాంకర్ ప్రదీప్ లేడని ……. అతడి మీద తప్పుడు కేసు పెట్టిందని అందుకు కారణం డాలర్ బాబు అని స్పష్టం చేశారు మంద కృష్ణ మాదిగ.

డాలర్ బాబు ప్రోద్బలం వల్లే యాంకర్ ప్రదీప్ పై తప్పుడు కేసు పెట్టిందని ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే ఎస్ ఎఫ్ ఐ నాయకుడు సుమన్ వల్లే ఆ యువతికి ఇంతటి దారుణమైన అన్యాయం జరిగిందని సుమన్ , డాలర్ బాబు లను అరెస్ట్ చేస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ముందుగా పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసాడు. యువతికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ….. ఆ యువతితో మాట్లాడానని పాపం పూలన్ దేవి కంటే దారుణంగా రేప్ చేసారని , వేధించారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఓ దళిత యువతిని 139 మంది అత్యంత దారుణంగా రేప్ చేసిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తనపై 139 మంది అత్యాచారం చేసారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇందులో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండటంతో ప్రదీప్ పేరు మారుమ్రోగింది. దాంతో యాంకర్ ప్రదీప్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాడు. కట్ చేస్తే మంద కృష్ణ మాదిగ యాంకర్ ప్రదీప్ కు ఈ కేసుతో సంబంధం లేదని ప్రకటించడంతో ప్రదీప్ ఊపిరి పీల్చుకోవడం ఖాయం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి