కాస్టింగ్ కౌచ్ పై అనసూయ వ్యాఖ్యలు

0
52
anasuya

 

హాట్ భామ అనసూయ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో కానీ ఇప్పుడు కానీ కాస్టింగ్ కౌచ్ తో నేను ఇబ్బందిపడిన సంఘటనలు లేవు , అయితే మనల్ని అవసరాలకు వాడుకునే వాళ్ళు అన్ని రంగాల్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉంటే కాస్టింగ్ కౌచ్ కాదు కదా కాస్టింగ్ పిల్లో కూడా మన దగ్గరకు చేరదు అంటూ సంచలనం సృష్టించింది అనసూయ. మనకు ఛాన్స్ రావాలంటే వాళ్ళ కోరిక తీర్చాలని అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు అక్కడ లొంగకుండా మనల్ని మనం నిరూపించుకునే సత్తా చూపించాలి అంటూ హితబోధ చేస్తోంది అనసూయ.

నాకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు లేవు కానీ ఫెవరిజంతో మాత్రం కొన్ని అవకాశాలు మిస్ అయ్యాను. అయినా నేను కొన్ని అవకాశాలు పోయాయని బాధపడలేదు. బాధపడుతూ కూర్చుంటే మరింతగా నీరుగారిపోతాం కాబట్టి మన సత్తా ఏంటో చూపించాలి అనుకున్నాను అనుకున్నట్లుగానే మంచి అవకాశాలు వస్తున్నాయి , నేను కావాలని అనుకున్న వాళ్లే మన దగ్గరకు వస్తారు కాబట్టి కాస్టింగ్ కౌచ్ గురించి నానా రభస చేయాల్సిన అవసరం లేదని నొక్కి వక్కాణిస్తోంది అనసూయ. జబర్దస్త్ తో సంచలనం సృష్టిస్తున్న ఈ భామ సినిమాల్లో కూడా సత్తా చాటుతోంది.

మునుపటి వ్యాసందగ్గుబాటి అభిరామ్ ని తిడుతూ  శ్రీరెడ్డి వీడియో
తదుపరి ఆర్టికల్ఇంద్రప్రస్థం మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచాడు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి