ఎక్స్ పోజింగ్ చేయనంటున్న భామ

0
21
Amrita Ayyar is not doing exposing

అందాలు చూపించడానికి నాకు అభ్యంతరం లేదు కాకపోతే అవి అసభ్యకరంగా ఉంటే మాత్రం తప్పకుండా అడ్డు చెబుతానని ఎక్స్ పోజింగ్ చేయనని సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ అమృత అయ్యర్. ఇంతకీ ఈ అమృత అయ్యర్ ఎవరో తెలుసా ……. తెలుగు ప్రేక్షకులకు యాంకర్ గా సుపరిచితుడైన ప్రదీప్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ప్రదీప్.

కాగా ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అమృత అయ్యర్. నీలి నీలి ఆకాశం అంటూ సాగే సూపర్ హిట్ సాంగ్ ఈ చిత్రంలో ఉంది. ఆ పాట ని మహేష్ బాబు విడుదల చేయడం వల్ల కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. కాగా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది అమృత అయ్యర్. ఆల్రెడీ తమిళ్ లో నటించింది దాంతో తెలుగులో కూడా మరో రెండు సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి ఈ భామకు. గ్లామర్ గా నటించడానికి అభ్యంతరం లేదని కాకపోతే అసభ్యంగా కనిపించడానికి నేను వ్యతిరేకం అని అంటోంది అమృత అయ్యర్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి