అంబటి రాంబాబు కు కరోనా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది

0
46
TMN logo
TMN logo

 


ఆంధ్రప్రదేశ్ కి చెందిన శాసన సభ్యులు అంబటి రాంబాబుకు కరోనా సోకింది. దాంతో అధికార వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకగా ఇప్పుడు ఆ జాబితాలో అంబటి రాంబాబు కూడా చేరాడు. ఇటీవల కాలంలో అంబటి రాంబాబు పలు కార్యక్రమాలలో పాల్గొన్నాడు దాంతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైంది. ఇటీవల కాలంలో అంబటిని కలిసిన వాళ్ళు నిలువెల్లా వణికిపోతున్నారు. అయితే అంబటి రాంబాబు గుంటూరు లోనే ఉండగా మరో కీలక నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా కరోనా సోకింది.

దాంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయసాయిరెడ్డికి కరోనా సోకిన విషయం తెలియడంతో వై సిపి శ్రేణుల్లో కలకలం మొదలైంది. జాగ్రత్తలు అవసరమని భావించిన విజయసాయిరెడ్డి అపోలో ఆసుపత్రిలో చేరాడు. విజయసాయిరెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కాబట్టి జగన్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తనని ఇకపై కలిసే వాళ్ళ లిస్ట్ తగ్గించాలని ఆదేశాలు జారీ చేశాడట అధికారులకు.

మునుపటి వ్యాసంబెదిరింపులతోనే సహజీవనం చేస్తున్నానని భయపడేది లేదంటున్నాడు
తదుపరి ఆర్టికల్తెలంగాణలో మరో శాసనసభ్యుడికి కరోనా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి