బాలకృష్ణ సరసన అమలా పాల్ కాదట

0
28

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో అమలా పాల్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించాడు. అమలాపాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేయలేదని, అమలాపాల్ కాకుండా కొత్త హీరోయిన్ ని ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేసారు. దాంతో అమలాపాల్ బాలయ్య సరసన నటించడం లేదు అన్నది తేలిపోయింది. అంటే బాలయ్య సరసన కొత్త భామ నటించనుందన్న మాట.

అమలాపాల్ మలయాళ భామ అయినప్పటికీ తెలుగులో అలాగే తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించే ఈ భామ కు మంచి పాత్రలే వస్తున్నాయి. అయితే అమలాపాల్ బాలయ్య సరసన నటించనుంది అని బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఈలోగానే వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లాడు దర్శకుడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు మోనార్క్ , సూపర్ మెన్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మరి వీటిలో ఏ టైటిల్ ని ఖరారు చేయనున్నారో చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి