రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్

0
9
Amala Paul ties the knot with boyfriend Bhavninder Singh

హాట్ భామ అమలా పాల్ రెండో పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది. గతకొంత కాలంగా కొత్త ప్రియుడు భవీందర్ సింగ్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది. అయితే ఈ ప్రేమ వ్యవహారం పెద్దగా వెలుగులోకి రాలేదు ఇన్నాళ్ళుగా. అలాంటి వ్యవహారాలు ఎంతగా దాచినా దాగవు కదా ! ఇటీవలే వెలుగులోకి వచ్చింది అమలా పాల్ ప్రేమ వ్యవహారం. సింగర్ భవీందర్ సింగ్ తో రొమాన్స్ చేస్తున్న ఈ భామ ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకుంది. తాజాగా అమలా పాల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

28 ఏళ్ల అమలా పాల్ మూడేళ్ళ క్రితం దర్శకులు ఏ ఎల్ విజయ్ కి విడాకులు ఇచ్చింది. అమలా పాల్ – విజయ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్ల కాపురం సాగకుండానే విడిపోయారు. కట్ చేస్తే అప్పటి నుండే భవీందర్ సింగ్ తో ప్రేమాయణం సాగిస్తోందట ఈ భామ కానీ ఇప్పుడు పెళ్లి కుదిరింది. మొత్తానికి తక్కువ వయసులోనే రెండు పెళ్లిళ్లు చేసుకుంది అమలా పాల్.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి