ఆ ఫోటోలు ఎందుకు డిలీట్ చేసినట్లు ?

0
14
Sri Reddy sensational comments on Amala Paul's second marriage

నేను రెండో పెళ్లి చేసుకోలేదు , ఒకవేళ పెళ్లి చేసుకుంటే చెబుతాను కదా ! అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ అమలా పాల్. తన బాయ్ ఫ్రెండ్ భవీందర్ సింగ్ తో కలిసి పెళ్లి దుస్తుల్లో కనిపించి సంచలనం సృష్టించింది. తమ పెళ్లి విషయాన్నీ అమలా పాల్ చెప్పలేదు కానీ భవీందర్ సింగ్ మాత్రం అమలా పాల్ తో పెళ్లి అయినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడమే కాకుండా అది వైరల్ అయ్యేలా చేసాడు. కట్ చేస్తే కొద్దిసేపట్లోనే ఆ ఫోటోలను డిలీట్ చేసాడు భవీందర్ సింగ్.

ఆ ఫోటోలు డిలీట్ చేయడానికి కారణం అమలా పాల్. పెళ్లి విషయాన్నీ అమలా పాల్ చెప్పలేదు కానీ భవీందర్ సింగ్ చెప్పాడు. కట్ చేస్తే మా పెళ్లి కాదు అది ఒక యాడ్ కు సంబందించిన ఫోటో షూట్ మాత్రమే అని చెప్పి చల్లగా జారుకుంది అమలా పాల్. సినిమావాళ్లు కాబట్టి అమలా పాల్ ఏది చెబితే అదే నిజం అని నమ్మాలి అంతే! ఒకవేళ ఫోటో షూట్ యాడ్ కోసమే అనుకుందాం మరి భవీందర్ సింగ్ ఆ ఫోటోలు ఎందుకు పెట్టి తీసేసినట్లు ? ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వదనుకుంటా ?

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి