ప్రభాస్ నిర్ణయం వల్ల డైలమాలో పడిన అల్లు అరవింద్

0
67
allu aravindh

ప్రభాస్ నిర్ణయం వల్ల డైలమాలో పడిన అల్లు అరవింద్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల అగ్ర నిర్మాత అల్లు అరవింద్ డైలమాలో పడ్డాడట. ప్రభాస్ నిర్ణయం వల్ల అల్లు అరవింద్ డైలమాలో పడటం ఏంటి ? అని అనుకుంటున్నారా? దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం తీయాలని అనుకున్నారు అల్లు అరవింద్. బాలీవుడ్ తో పాటుగా తెలుగు, తమిళ, మలయాళ ,కన్నడ భాషల్లో ఏకకాలంలో రామాయణం తీయాలని పెద్ద ఎత్తున రూపకల్పన చేసాడు. అందుకు తెరవెనుక చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే సరిగ్గా ఇదే సమయంలో ప్రభాస్ ఆది పురుష్ అంటూ భారీ ప్రాజెక్టును ప్రకటించారు. దాంతో ప్రభాస్ ఆది పురుష్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు తన ప్రయత్నాలు మళ్లీ ముమ్మరం చేయొచ్చని , అప్పటి వరకు మిగతా ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడట అల్లు అరవింద్.

టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా కీర్తి గడించిన అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ పతాకంపై ఇండస్ట్రీ దుమ్ము దులిపే చిత్రాలను నిర్మించాడు. ఇతర హీరోలతో కూడా అల్లు అరవింద్ సినిమాలు నిర్మించాడు కానీ ఎక్కువగా మాత్రం నిర్మించింది మెగాస్టార్ చిరంజీవితోనే. గీతా ఆర్ట్స్ ఎదగడానికి అలాగే చిరంజీవి కి మరింతగా ఇమేజ్ పెరగడానికి ఇలా ఉభయ కుశలోపరిగా ఒకరికి ఒకరు దోహదపడ్డారు. తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా హిందీలో కూడా పలు చిత్రాలను నిర్మించాడు అల్లు అరవింద్. ఈ ఏడాది ప్రారంభంలో అల వైకుంఠ పురంలో అనే బ్లాక్ బస్టర్ అందించి మరోసారి సత్తా చాటారు అల్లు అరవింద్.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే…… బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగింది. ఒకప్పుడు టాలీవుడ్ హీరో మాత్రమే కానీ ఇప్పుడు నేషనల్ , ఇంటర్నేషనల్ హీరో అయ్యాడు. దాంతో భారీ బడ్జెట్ చిత్రాలను ప్రభాస్ తో చేయాలని సన్నాహాలు చేస్తున్నారు పలువురు దర్శక నిర్మాతలు. అందులో భాగంగానే ఈ ఆది పురుష్ సినిమా . బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ భారతీయులకు అందునా హిందువులకు ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడు పాత్రలో కనిపించనున్నాడు. ఒకవైపు అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమైన సమయంలో ఇలా శ్రీరాముడు పై ప్రభాస్ సినిమా అంటే బాక్స్ లు బద్దలు కావాల్సిందే అన్నమాట.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి