ఊర మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్

0
27
allu arjun playing mass character in next sukumar movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ క్యారెక్టర్ లో నటించనున్నాడు. ఇప్పటివరకు ఊర మాస్ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ పోషించలేదు. రుద్రమదేవి చిత్రాల్లో గోన గన్నారెడ్డి పాత్రలో మాస్ గా అలరించాడు అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు చిత్రంలో ఊర మాస్ అనే డైలాగ్ వాడాడు కానీ ఊర మాస్ క్యారెక్టర్ ని ఇప్పటివరకు పోషించలేదు కట్ చేస్తే సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో మాత్రం ఊర మాస్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే చిత్రంలో లారీ డ్రైవర్ గా గంధపు చెక్కల స్మగ్లర్ గా ఊర మాస్ పాత్ర పోషించనున్నాడు అల్లు అర్జున్. ఇంతకుముందు సుకుమార్అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఆర్య , ఆర్య 2 చిత్రాలు రాగా ఇది మూడో సినిమా. ఆర్య బ్లాక్ బస్టర్ అయ్యింది అయితే ఆర్య 2 మాత్రం ప్లాప్ అయ్యింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది , ఇక ఇప్పుడు రెండో షెడ్యూల్ స్టార్ట్ అవుతోంది. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది చిత్రంలో

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి