అల్లు అర్జున్ ని ఛాన్స్ అడుగుతున్న బాలీవుడ్ డైరెక్టర్

0
55

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఒక్క చాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కాగా ఆ సినిమాని నెట్ ఫ్లిక్ష్ లో ఇటీవల చూసాడట బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా. ఆ సినిమా నచ్చడంతో అల్లు అర్జున్ నటనపై ప్రశంసల వర్షం కురిపించాడు దాంతో అల్లు అర్జున్ స్పందించి సంజయ్ గుప్తా కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇంకేముంది తనకు అల్లు అర్జున్ స్పందించడంతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీతో మంచి సినిమా తీస్తానని అంటున్నాడు.

అయితే సంజయ్ గుప్తా మళ్లీ చేసిన విజ్ఞప్తికి అల్లు అర్జున్ సమాధానం ఇవ్వలేదు. అల వైకుంఠపురంలో చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ప్రభంజనం సృష్టించింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా టబు తల్లిగా నటించింది. థమన్ అందించిన పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. బుట్టబొమ్మ బుట్టబొమ్మ అనే పాట యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తోంది. అలాగే సామాజవరగమన , ఓ మై డాడీ , రాములో రాములా అనే పాటలు కూడా అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ లు లేక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు అల్లు అర్జున్.

మునుపటి వ్యాసంFlute music,Bharatha veda muga .. Wonder full Songs || Prabhas || Charmi ||pournami movie
తదుపరి ఆర్టికల్మరో టీవీ నటుడికి సోకిన కరోనా
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి