అల్లు అర్జున్ చిత్రానికి టైటిల్ అదేనా ?

0
40
allu arjun new movie title announcement in april 8th

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా చిత్రానికి శేషాచలం అనే టైటిల్ ని పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. పగ ప్రతీకారం నేపథ్యంలో చిత్రం రూపొందుతోంది పైగా శేషాచలం అడవుల్లో ఉన్న గంధపు చెక్కల కోసం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు స్మగ్లర్లు.

అందుకే శేషాచలం అనే టైటిల్ ని పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఫైనల్ చేయలేదు కానీ శేషాచలం టైటిల్ పై అయితే ఆలోచన చేస్తున్నారట. సుకుమార్అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇంతకుముందు రెండు చిత్రాలు రాగ ఇది మూడో సినిమా. ఇక సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్. దసరా కు పది రోజుల సెలవులు ఉంటాయి కాబట్టి దాన్ని మరింతగా క్యాష్ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు సుకుమార్ అండ్ కో

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి