అల్లు అర్జున్ కొరటాల శివ సినిమా కన్ఫర్మ్

0
62
bunny movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రానుందని గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే ఈరోజు అధికారికంగా కొత్త సినిమా ప్రకటించారు. గీతా ఆర్ట్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ 21 వ సినిమా అని ప్రకటించారు. అంటే ప్రస్తుతం చేస్తున్న సినిమా పుష్ప 20 వ సినిమా కాగా పుష్ప తర్వాత దిల్ రాజు బ్యానర్ లో 21 వ సినిమా చేయాలి అల్లు అర్జున్. కానీ కొరటాల శివ సినిమా 21 వది అని అనౌన్స్ చేశారంటే దిల్ రాజు సినిమా పక్కకు పోయినట్లే అని చెప్పాలి.

కొరటాల శివ తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ జరుపుకుంది. మళ్లీ షూటింగ్ అనుకునే లోపు కరోనా వచ్చింది. దాంతో గత 4 నెలలుగా షూటింగ్ లు లేకుండాపోయాయి. ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసాక అల్లు అర్జున్ తో కలవనున్నాడు కొరటాల శివ. ఇక అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్ళేది ఇదే. ఇక ఈ సినిమాని 2022 ప్రారంభంలోనే విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు కూడా. ఇప్పటికైతే హీరో దర్శకుడు సెట్ అయ్యారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అన్నది వచ్చే ఏడాది తేల్చనున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి