మహబూబ్ నగర్ అడవుల్లో అల్లు అర్జున్

0
71
pushpa movie hero allu arjun

మహబూబ్ నగర్ అడవుల్లో అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. కేరళలోని దట్టమైన అడవుల్లో మిగతా షెడ్యూల్ చేయాలని అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కూడా కానీ అనూహ్యంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేయడంతో షూటింగ్ లన్నీ ఆగిపోయాయి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ కేరళ వెళ్లడం షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదని భావించి కేరళ అడవులకు బదులుగా తెలంగాణ – ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అడవుల్లో పుష్ప చిత్రం షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారట సుకుమార్ అండ్ కో.

నల్లమల అటవీ ప్రాంతం మహబూబ్ నగర్ , కర్నూలు జిల్లాలను ఆనుకొని ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం. అందుకే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాలలోని అడవుల్లో పుష్ప షూటింగ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్. ఇప్పటికే మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లి రావడం కూడా జరిగిందట. సినిమాకు అవసరమైన లొకేషన్ ల వేటలో పడ్డారట సుకుమార్ అండ్ కో. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి తిరుపతి అడవులతో పాటుగా మహబూబ్ నగర్ అడవుల్లో షూటింగ్ చేయనున్నారట.

అల్లు అర్జున్ పుష్ప గా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మీక మందన్న నటిస్తుండగా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ని ఐటమ్ సాంగ్ కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న నేపథ్యంలో శ్రద్దా కపూర్ ఐటమ్ సాంగ్ ఈ సినిమాకు మరింతగా కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇక సుకుమార్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్ అన్నది ప్రత్యేకం అన్న సంగతి తెలిసిందే. పైగా దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు కాబట్టి ఐటెం సాంగ్ మీద మరింతగా ఫోకస్ పెట్టారట. దసరా తర్వాత పుష్ప చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించే పనిలో పడ్డాడట సుకుమార్.

మునుపటి వ్యాసంచిరంజీవి ఆచార్యలో విజయ్ దేవరకొండ
తదుపరి ఆర్టికల్రేవంత్ రెడ్డి పై ప్రశంసలు కురిపించిన టీఆర్ఎస్ లీడర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి