అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ కు మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా ?

0
22
Why Miss Gita Govindam picture

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ” రేసుగుర్రం ” లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. 2014 లో విడుదలైన రేసుగుర్రం ఆ ఏడాది నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. అప్పటి వరకు ఉన్న అల్లు అర్జున్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది రేసుగుర్రం చిత్రం. కట్ చేస్తే మళ్ళీ అల్లు అర్జున్ – సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో సినిమా రాలేదు. అయితే ఇన్నాళ్లకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయమని తెలుస్తోంది.

2021 లో అల్లు అర్జున్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సినిమా రావడం తధ్యమని తెలుస్తోంది. రేసుగుర్రం చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చేసాడు. అంతకుముందు చరణ్ తో ధ్రువ చిత్రాన్ని చేసాడు సురేందర్ రెడ్డి. ఇక అల్లు అర్జున్ ని కొత్తగా చూపించాడు సురేందర్ రెడ్డి అందుకే అతడితో మళ్ళీ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్. ఇప్పటికే ఓ లైన్ వినిపించాడట సురేందర్ రెడ్డి. ఈ కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే మరో బ్లాక్ బస్టర్ ఖాయమే !

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి