ప్రభాస్ రికార్డ్ ని బద్దలుకొట్టిన అల్లు అర్జున్

0
67
allu arjun,hit combination

ప్రభాస్ రికార్డ్ ని బద్దలుకొట్టిన అల్లు అర్జున్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డ్ ని అవలీలగా బద్దలు కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం బహుబలి 2. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొట్టడమే కాకుండా బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్ లో కూడా అదిరిపోయేలా రికార్డుల మోత మోగించింది. తెలుగునాట అత్యధికంగా 22. 70 టీఆర్పీ రేటింగ్ సాధించింది బాహుబలి 2 చిత్రం. ఇప్పటి వరకు ఇదే అత్యధిక టీఆర్పీ అని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ తాజాగా అల……. వైకుంఠ పురంలో చిత్రంతో ప్రభాస్ రికార్డ్ ని బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.

ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల ……. వైకుంఠ పురంలో చిత్రం బుల్లితెరలో ప్రసారమైంది. కాగా ఈ చిత్రానికి అనూహ్యంగా 29.4 రేటింగ్ తెచ్చుకొని టాలీవుడ్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ చిత్రంతో పాత రికార్డులు అన్ని బద్దలు అయ్యాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ రికార్డ్ ని బద్దలు కొట్టాలంటే 29.4 కి పైగా రేటింగ్ సాధించాల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల….. వైకుంఠ పురంలో చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అల…… వైకుంఠ పురంలో చిత్రం విడుదల అయ్యింది. ఈ ఏడాదిలో ప్రభంజనం సృష్టించిన చిత్రంగా నిలిచింది అల….. వైకుంఠ పురంలో. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి దాంతో అల….. వైకుంఠ పురంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా తమన్ అందించిన పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో అల్లు అర్జున్ చిత్రానికి రికార్డులు కట్టబెట్టారు ప్రేక్షకులు. తమన్ అందించిన పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

మునుపటి వ్యాసంతల్లి కాబోతున్న అనుష్క
తదుపరి ఆర్టికల్రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి