అఖిల్ తొలి బ్లాక్ బస్టర్ చిత్రానికి 25 ఏళ్ళు

0
28
akhil as a sisindhiri

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్అక్కినేని అఖిల్ నటించిన మొట్టమొదటి చిత్రం ” సిసింద్రీ ”. కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి సరిగ్గా 25 సంవత్సరాలు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం శివనాగేశ్వర్ రావు దర్శకత్వంలో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించాడు. అఖిల్ వయసు చాలా చిన్నది ఈ సినిమాలో నటించే నాటికి అయినప్పటికీ దర్శకుడు శివనాగేశ్వర్ రావు అలాగే అమల , నాగార్జున చాలా కస్టపడి ఈ చిత్రాన్ని చేసారు ప్రేక్షకుల చేత జేజేలు అందుకున్నారు. పట్టుమని మూడేళ్లు కూడా లేని అఖిల్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.

ఇక ఈ చిత్రంలో నాగార్జున స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం. ఆటాడుకుందాం రా అంటూ టబు తో ఆడిపాడి ప్రేక్షకులకు కావాల్సిన జోష్ నందించాడు. టబు ఓ పాటలో మెరిసి ప్రేక్షకులను అలరించింది. ఆంగ్ల చిత్రానికి కొన్ని మార్పులు చేసి తీసిన సిసింద్రీ బాగా ఆడటంతో అఖిల్ పెద్ద హీరో అవ్వడం ఖాయమని అప్పుడే అనుకున్నారు. 1995 సెప్టెంబర్ 14 న విడుదలైన సిసింద్రీ మంచి విజయం సాధించడంతో అఖిల్ కు మార్గం సుగమమైంది.

అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం అఖిల్ ఆ స్థాయి విజయాన్ని సోలోగా అందుకోలేకపోయాడు. మనం చిత్రంలో కూడా క్లైమాక్స్ లో కనిపించి భారీ అంచనాలు పెంచేలా చేసాడు . మనం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ అఖిల్ సోలోగా నటించిన చిత్రాలు ఆస్థాయి విజయాలు అందుకోలేదు. అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను చిత్రాల్లో సోలో హీరోగా నటించాడు అఖిల్  ఇక ఇప్పుడేమో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . ఈ సినిమాతోనైనా అఖిల్  బ్లాక్ బస్టర్ అందుకుంటాడా ? చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి