కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్

0
29
akabrudhin fire on cm kcr

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్ఎం ఐ ఎం – అధికార టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఎం ఐ ఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ – కేసీఆర్ లది అవినాభావ సంబంధం అన్నట్లుగా ఉంది. అయితే అసద్ తమ్ముడు అసెంబ్లీలో ఎం ఐ ఎం పక్ష నేత అయిన అక్బరుద్దీన్ ఒవైసీ అయితే అవకాశం చిక్కినప్పుడల్లా అధికార టీఆర్ఎస్ పార్టీపై అలాగే కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే పలుమార్లు అక్బర్ కేసీఆర్ పై చులకనగా మాట్లాడగా తాజాగా మరోసారి అసెంబ్లీ లో కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.


తెలంగాణ అసెంబ్లీలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 7 నుండి ఈ సమావేశాలు జరుగుతున్నాయి కాగా ఈరోజు అసెంబ్లీలో కరోనా పరిస్థితులు , తీసుకున్న జాగ్రత్తలపై స్వల్ప కాలిక చర్చ సాగగా ఈ చర్చలో తెలంగాణ ప్రభుత్వంపై కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు . అంతేకాదు పెద్ద పెద్ద నోరు వేసుకొని మండిపడ్డాడు. అయితే అక్బర్ ఎంతగా రెచ్చిపోయిన కేసీఆర్ మాత్రం సావధానంగా సమాధానం ఇచ్చాడు. కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో కూడా అక్బర్ ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ మాత్రం ఆవేశం తగ్గించుకొని మాట్లాడండి ……. ఆవేశంగా మాట్లాడుతున్నది నేను కాదు మీరు అంటూ అక్బరుద్దీన్ ని ఉద్దేశించి అన్నారు.

అయితే ఎవరు ఎంతగా చెప్పినా అక్బర్ లో మాత్రం ఆవేశం తగ్గలేదు దాంతో మిత్రపక్షంగా ఉన్న ఎం ఐ ఎం నేత ఇలా మాట్లాడటం ఏంటి ? అని అధికార సభ్యులు షాక్ అయ్యారు. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ సంవాదం చాలా సంతోషాన్నించింది అందుకే అక్బరుద్దీన్ కు ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని పదేపదే పట్టుబట్టారు. మొత్తానికి అక్బరుద్దీన్ మొదటి నుండి కూడా కేసీఆర్ ప్రభుత్వం పై ఆగ్రహంగానే ఉంటున్నాడు కానీ అసదుద్దీన్ మాత్రం కేసీఆర్ తో సఖ్యతనే కోరుకుంటున్నాడు. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి