సమంత పాత్రని తన్నుకుపోయిన ఐశ్వర్య

0
39
aishwaraiah rajesh

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్హీరోయిన్ సమంత పోషించాల్సిన పాత్రని తెలుగమ్మాయి ఐశ్వర్య తన్నుకుపోయింది. సమంత పాత్రని ఐశ్వర్య తన్నుకుపోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే ద్విభాషా చిత్రంలో హీరోయిన్ గా సమంత నటించడానికి ఒప్పుకుంది మొదట. అయితే ఈ సినిమాలో హీరోలుగా శర్వానంద్ , సిద్దార్థ్ లను ఎంపిక చేయబోతున్నారని తెలిసో లేక మరో కారణమో కానీ సమంత ఆ తర్వాత మహాసముద్రం చిత్రం చేయలేనని అందులో నుండి తప్పుకుంది దాంతో ఆమె స్థానంలో తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేసారు.

ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలు. తమిళంలో హీరోయిన్ గా మంచి పొజీషన్ లో ఉంది ఐశ్వర్య. పైగా మహాసముద్రం చిత్రం తెలుగు , తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం కాబట్టి ఐశ్వర్య రాజేష్ బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అయ్యారట దర్శకుడు అజయ్ భూపతి. ఇక సమంత చేయాల్సిన పాత్ర తనకు లభిస్తుండటంతో సంతోషంగా ఒప్పుకుందట ఐశ్వర్య రాజేష్.

శర్వానంద్ , సిద్దార్థ్ ఇద్దరు హీరోలు కాగా శర్వానంద్ సరసన ఐశ్వర్య నటించనుంది. ఇక సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే కానీ గత 7 సంవత్సరాలుగా తెలుగులో నటించలేదు. అలాగే ఈ హీరో నటించిన చిత్రాలన్నీ తెలుగుతో పాటుగా తమిళంలో కూడా వరుసగా ప్లాప్ అవుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే సిద్దార్థ్ కు మంచి ఛాన్స్ లభించింది. ఇక ఈ మహాసముద్రం చిత్రంలో పలువురు స్టార్ హీరోలు రవితేజ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అక్కినేని నాగచైతన్య తదితరులు నటించాల్సి ఉండే కానీ వాళ్ళు ముందు ఒప్పుకొని ఆ తర్వాత తప్పుకున్నారు దాంతో శర్వా – సిద్దార్థ్ లు లైన్ లోకి వచ్చారు.

మునుపటి వ్యాసంఆ పాత్రలో తమన్నానా ?
తదుపరి ఆర్టికల్కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భట్టి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి