విజయ్ కి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు

0
34
again it raids on vijay home

తమిళ స్టార్ హీరో విజయ్ కి మరోసారి షాక్ ఇచ్చారు ఐటీ శాఖాధికారులు. ఇప్పటికే గత నెలలో ఐటీ అధికారులు విజయ్ ఇంటిపై ఆఫీసుపై దాడులు నిర్వహించిన అధికారులు తాజాగా ఈరోజు మళ్ళీ విజయ్ ఇంటిపై దాడి చేసారు. దాంతో షాక్ అయ్యాడు హీరో విజయ్. గత మూడేళ్ళుగా విజయ్ ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఐటీ అధికారులు. దాంతో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఐటీ అధికారుల మీద అలాగే కేంద్ర ప్రభుత్వం మీద.

గతకొంత కాలంగా విజయ్ తన సినిమాలలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మీద సెటైర్ లు వేస్తున్నాడు అలాగే ప్రశ్నిస్తున్నాడు దాంతో కక్ష్య కట్టి ఇలా చేస్తున్నారని విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ కావడం అలాగే భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో ఐటీ అధికారులు తరచుగా దాడులు నిర్వహిస్తున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి