చైతూకి రాఖీ కడతానని వార్నింగ్ ఇచ్చిందట

0
32
samanth chaithu

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్-  అక్కినేని నాగచైతన్య కు రాఖీ కడతానని వార్నింగ్ ఇచ్చిందట సమంత. అయితే ఈ వార్నింగ్ ఇప్పుడు కాదు సుమా ! పెళ్లి కాకముందు. ఇంతకీ రాఖీ కడతానని ఎందుకు అన్నదో తెలుసా …….. మన ప్రేమ విషయాన్ని మీ ఇంట్లో చెప్పు అనుమతి తీసుకో ……. ఇంట్లో చెప్పకుండా కాలయాపన చేసావనుకో నీకు రాఖీ కట్టి అన్నయ్యా ! అంటాను ఆ తర్వాత నీ ఇష్టం అంటూ గట్టిగా బెదిరించిందట సమంత దాంతో చేసేదిలేక తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాడట నాగచైతన్య. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే కదా !

అక్కినేని నాగచైతన్య – సమంత ఇద్దరూ కలిసి ప్రేమించుకున్నారు. అయితే పెళ్ళికి మాత్రం కాస్త సమయం పట్టింది. నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఓకే చెప్పడంతో అంగరంగ వైభవంగా చైతూ – సమంతల పెళ్లి జరిగింది. సమంత పెళ్లి చేసుకున్నప్పటికీ సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. అంతేనా పెళ్లి అయ్యాక మరింత గ్లామర్ గా నటిస్తోంది. అలాగే సోలో హీరోయిన్ గా కూడా సత్తా చాటుతోంది సమంత.

ఇక అక్కినేని నాగచైతన్య విషయానికి వస్తే ……. స్టార్ గా ఎదగకపోయినా మంచి నటుడిగా రాణిస్తున్నాడు. అలాగే మంచి మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు మిడిల్ రేంజ్ హీరోగా. అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ రొమాంటిక్ హీరోగా ఎదిగాడు. రొమాంటిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు చైతూ. తాజాగా ఈ హీరో లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి