ఈనెల 30 న కోర్టుకు హాజరుకానున్న అద్వానీ

0
18
adavani bjp party

టాలీవుడ్ మూవీ న్యూస్, ఢిల్లీ –భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ఈనెల 30 న సీబీఐ కోర్టుకి హాజరుకానున్నారు. 92 ఏళ్ల అద్వానీ బాబ్రీ మసీద్ కూల్చివేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ఈనెల 30 న సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. తుది తీర్పు వెల్లడిస్తున్నందున కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరు కూడా స్వయంగా హాజరు కావాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది సీబీఐ కోర్టు దాంతో ఎల్ కె అద్వానీ తో పాటుగా ఈ ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళీమనోహర్ జోషి , ఉమాభారతి తదితరులు నేరుగా సీబీఐ కోర్టుకి హాజరు కానున్నారు.

1992 లో అద్వానీ రథయాత్ర చేసిన విషయం తెలిసిందే. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేయాలంటూ రథయాత్ర చేసిన అద్వానీ భారతీయ జనతా పార్టీని భారతదేశంలో బలోపేతం అయ్యేలా చేసాడు. అంతకుముందు కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ ఇప్పుడు 300 పైచిలుకు పార్లమెంట్ స్థానాలను దక్కించుకొని అధికారంలో కొనసాగుతోందంటే అందుకు ముఖ కారకుడు అద్వానీ.

అద్వానీ – అటల్ బిహారీ వాజ్ పేయి ల నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ ఎదిగింది. ఆ నాయకులు అందించిన విజయాలతో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. 1992 లో అద్వానీ రెచ్చగొట్టడం వల్లే బాబ్రీ మసీద్ ని కరసేవకులు కూల్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక 28 సంవత్సరాల తర్వాత ఈ కేసులో తుది తీర్పు ఈనెల 30 న రానుంది. తీర్పు ఎలా రానుందో ? అద్వానీ ఈ కేసు నుండి బయట పడతాడా ? లేదా ? అన్న టెన్షన్ లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. 

మునుపటి వ్యాసంఅక్టోబర్ 2 న అనుష్క నిశ్శబ్దం
తదుపరి ఆర్టికల్సినిమా ప్రకటించిన ఖైదీ దర్శకుడు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి