అదిరిపోయే రేంజ్ లో ప్రభాస్ కొత్త చిత్రం

0
66
prabhas 22 movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే రేంజ్ లో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. నిన్న సాయంత్రం రోజున తన అభిమానులకు ఈరోజు ఉదయం ఓ శుభవార్త చెబుతానని మాట ఇచ్చినట్లుగానే ఉదయం 7గంటల 11 నిమిషాలకు కొత్త సినిమా వివరాలు ప్రకటించాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ” ఆది పురుష్ ” అనే చిత్రాన్ని చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు ప్రభాస్. ఇది ప్రభాస్ కు 22 వ సినిమా కానుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హిందీ , తెలుగు , తమిళ్ , మలయాళం , కన్నడ భాషల్లో నిర్మించనున్నారు. సుమారుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ ,కృష్ణ కుమార్ , ప్రసాద్ సుతార్ ,రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. అలాగే దర్శకుడు ఓం రౌత్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.

ఇక ఈ సినిమా మైథలాజికల్ తో పాటుగా సోషియో ఫాంటసీ కథగా రూపొందనుంది. ఆది పురుష్ అని విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వీరాంజనేయుడు కనబడుతున్నాడు దాంతో రామాయణం ని టచ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. అంటే బహుశా ప్రభాస్ శ్రీరాముడిగా నటించనున్నాడు అనే హింట్ ఇచ్చారు పరోక్షంగా. రామాయణాన్ని అలాగే ఇప్పటి కాలాన్ని మిళితం చేస్తూ కథని రూపొందించాడన్న మాట ఓం రౌత్. ఇటీవలే తన్హాజీ చిత్రంతో సంచలనం సృష్టించాడు ఓం రౌత్ దాంతో అతడితో సినిమా  అంగీకరించాడు ప్రభాస్.

500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదు కానీ బాలీవుడ్ భామనే హీరోయిన్ గా ఎంపిక చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యే సినిమా కాబట్టి అదే రేంజ్ లో హీరోయిన్ ని తీసుకోవడం ఖాయం. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. రాధే శ్యామ్ చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఆ సినిమా తర్వాత ఓం రౌత్ సినిమా అన్నమాట.

మునుపటి వ్యాసంహీరోగా పరిచయం కానున్న ఎన్టీఆర్ బావమరిది
తదుపరి ఆర్టికల్దృశ్యం దర్శకుడు కన్నుమూత
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి