సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న నటి

0
50
Vidyullekha raman got engagement

సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది కమెడియన్ అయిన విద్యుల్లేఖ. తమిళ నటి అయిన విద్యుల్లేఖ ఎక్కువగా నటించింది మాత్రం తెలుగులోనే. రన్ రాజా రన్, సరైనోడు, రాజుగారి గది తదితర తెలుగు చిత్రాల్లో నటించింది విద్యుల్లేఖ. హాస్య నటిగా తెలుగు ప్రేక్షకులను విశేషం గా అలరించిన ఈ భామ ఎట్టకేలకు ఎంగేజ్ మెంట్ చేసుకుంది. న్యూట్రిషన్ అండ్ ఫిట్నెష్ ట్రైనర్ అయిన సంజయ్ ని పెళ్లాడనుంది విద్యుల్లేఖ. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ ఇద్దరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సైలెంట్ గా ఆగస్ట్ 26 న వివాహ నిశ్చితార్థం జరిగింది.

అయితే ఎంగేజ్ మెంట్ జరిగింది కానీ ఈ విషయాన్ని బయటపెట్టలేదు. ఇక తమిళ మీడియాలో రకరకాల వార్తలు వస్తుండటంతో ఎట్టకేలకు స్పందించింది. ఆగస్ట్ 26 న నా ఎంగేజ్మెంట్ జరిగిందని , ఇక పుకార్లు ఆపండని పేర్కొంది. నన్ను మెచ్చిన సంజయ్ ని పెళ్లాడనున్నట్లు పేర్కొంది. కరోనా విలయతాండవం చేస్తుండటంతో కోవిడ్ నిబంధనలను అనుసరించి కొద్ది మంది సమక్షంలో ఈ వివాహ నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది విద్యుల్లేఖ.

ఫిట్నెష్ ట్రైనర్ కూడా అయిన సంజయ్ విద్యుల్లేఖ బరువు తగ్గడానికి పలు సలహాలు సూచనలు చేసాడు. విద్యుల్లేఖ చాలా లావుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లికి ముందే ఇంత లావుగా ఉంటే బాగోదని ట్రైనర్ దగ్గరకు వెళ్లగా ఒకవైపు లావు తగ్గించే పనిలో మరింతగా దగ్గరయ్యారు దాంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇప్పుడు విద్యుల్లేఖ చాలా లావు తగ్గింది. దాంతో ఆమెని చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. విద్యుల్లేఖ గట్టి పిండమే అందుకే ఎంత కష్టమైన సరే లావు తగ్గిందని ఆశ్చర్యపోతున్నారు. విద్యుల్లేఖ – సంజయ్ ల పెళ్లి ఈ ఏడాదిలోనే అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది.

మునుపటి వ్యాసంప్రభాస్ ఫ్యాన్స్ కు  మరో సినిమా
తదుపరి ఆర్టికల్విషాదం : పవన్ కల్యాణ్ అభిమానులు మృతి
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి