నిర్బంధంలో సుహాసిని కొడుకు

0
19
Actress Suhasini posts video of Nandan Mani Ratnam isolating himself

సీనియర్ నటి సుహాసిని – మణిరత్నం ల కొడుకు నందన్ మణిరత్నం లండన్ వెళ్లి రావడంతో స్వీయ నిర్భందం విధించుకున్నాడు. లండన్ వెళ్లిన సుహాసిని కొడుకు ఇటీవలే చెన్నై తిరిగి వచ్చాడు. అయితే కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ అవి నెగెటివ్ వచ్చాయి. కానీ 14 రోజుల్లోపు అది ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండటంతో 14 రోజుల పాటు నిర్భందంలో ఉండాల్సిందే అన్న నిబంధన ఉండటంతో గృహ నిర్బంధంలో ఉండటానికి సిద్దమయ్యాడు నందన్.

చెన్నై లోని తన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్న కొడుకుతో గ్లాస్ కు అవతలి వైపున ఉండి సుహాసిని మాట్లాడుతుండగా తీసిన వీడియోని మరో నటి కుష్భు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా చర్యలు తీసుకోవడం వల్ల కరోనా ని అదుపులో పెట్టొచ్చు అంటూ ట్వీట్ చేసింది కుష్భు. సుహాసిని తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడేమో తల్లిగా , వదిన పాత్రలు పోషిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపొయింది. దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్యా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. తాజా వార్తల ప్రకారం 419 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి భారత్ లో 8 మంది చనిపోయారు కరోనాతో.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి