పెళ్లి చేసుకున్న హీరోయిన్

0
27
actress sheela gets married

హీరోయిన్ షీలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది. చెన్నై లో షీలా పెళ్లి జరిగింది , పెళ్లి వేడుకలో సినిమారంగానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా పాల్గొనకపోవడం విశేషం. అంటే భామ సినిమారంగంలోని వాళ్ళని ఎవరిని కూడా పిలవలేదట దాంతో ఎవరూ రాలేదు. తెలుగు , తమిళ్ , కన్నడ భాషలలో కలిపి దాదాపు 24 సినిమాల్లో నటించింది. తెలుగులో స్టార్ హీరోలైన ఎన్టీఆర్ , అల్లు అర్జున్ సరసన కూడా నటించింది షీలా.

ఎన్టీఆర్ తో అదుర్స్ లో అల్లు అర్జున్ తో పరుగు చిత్రంలో నటించింది. వాటితో పాటుగా మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. అదుర్స్ , పరుగు చిత్రాలు సూపర్ హిట్ అయినప్పటికీ షీలా కోరుకున్న స్టార్ ఇమేజ్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే తెలుగు నిర్మాతతో సహజీవనం చేస్తున్నట్లు పుకార్లు షికారు చేసాయి అప్పట్లో. కట్ చేస్తే ఇప్పుడు సంతోష్ రెడ్డి ని పెళ్లి చేసుకుంది షీలా

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి