సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్న నటి ఆత్మహత్య

0
37
sravani kondapally

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్–  సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోనివిధంగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగుతోంది సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు. మొన్న అర్ధరాత్రి సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం దేవరాజ్ రెడ్డి అనే యువకుడు అని శ్రావణి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో నేను అమాయకుడిని , నాకు శ్రావణి ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదు శ్రావణి ఆత్మహత్యకు కారణం సాయి అనే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు దేవరాజ్ రెడ్డి.

అంతేకాదు సాయి ఒక్కడే కాదు ఆర్ ఎక్స్ 100 నిర్మాత అయిన అశోక్ రెడ్డి తో కూడా శ్రావణి కి సంబంధాలు ఉన్నాయని అందుకే వాళ్ళని నిలదీసి అడిగానని , నా కంటే ముందు వాళ్లతో శ్రావణికి మంచి అనుబంధం ఉందని సాయి అనే వ్యక్తి నాపై దాడి చేసాడు , కొట్టాడు . అలాగే శ్రావణి ని కూడా కొట్టాడు శ్రావణి చెప్పడం వల్లే నేను రెస్టారెంట్ నుండి వెళ్ళిపోయాను కానీ ఈలోగా ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని మేమిద్దరం ప్రేమించుకున్నామని …….. నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగింది శ్రావణి అంటూ తన వెర్షన్ చెప్పుకొచ్చాడు దేవరాజ్ రెడ్డి.

అయితే సాయి మాత్రం తప్పంతా దేవరాజ్ దే అని అంటున్నాడు. శ్రావణి ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అందుకే అతడ్ని వారించానని ,ఒకవేళ నేను తప్పు చేస్తే పారిపోయే వాడ్ని కదా ! అని అంటున్నాడు. ఇలా దేవరాజ్ తనకు అనుకూలంగా, సాయి తనకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. అయితే దేవరాజ్ శ్రావణి ని బెదిరిస్తున్న ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ టేప్ ప్రకారం అయితే తప్పంతా దేవరాజ్ దే అని తెలుస్తోంది. మొత్తానికి సీరియల్ లాగా సాగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది శ్రావణి ఆత్మహత్య కేసు. ఇక పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి