అత్యాచారం కేసులో స్పందించిన నటుడు కృష్ణుడు

0
78
actor krishnudu
అత్యాచారం కేసులో స్పందించిన నటుడు కృష్ణుడు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న కేసు 139 మంది ఓ దళిత యువతిపై అత్యాచారం చేసారని. ఆరేళ్లుగా సాగిన రాక్షస క్రీడలో ఇన్నాళ్లకు బయటకు వచ్చి హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది ఆ యువతి. అయితే ఈ కేసులో పలువురు సినీ నటులు , యాంకర్లు, రాజకీయ నాయకులు, వాళ్ళ పిఏ లు కూడా ఉన్నారట. ఇప్పటికే యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉందంటూ కథనాలు వెలువడ్డాయి దాంతో నేను ఎలాంటి అత్యాచారం చేయలేదు నాకు సంబంధం లేదంటూ ఖండించాడు కూడా. ఇక ఇప్పుడేమో నటుడు కృష్ణుడు వంతు వచ్చింది.

వినాయకుడు చిత్రంలో హీరోగా నటించిన కృష్ణుడు తెలుగులో దాదాపు 100 చిత్రాల్లో రకరకాల పాత్రలు పోషించాడు. అందులో కొన్ని చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. అయితే కొంత కాలంగా ఎక్కువగా సినిమాల్లో నటించడం లేదు. ఇటీవలే ఓ సినిమాని నిర్మించాడు కూడా. నిర్మాతగా మారిన కృష్ణుడు ఆ సినిమాని ఎలా బయట పడేయాలో ఆలోచిస్తున్న తరుణంలో అత్యాచారం కేసులో హీరో కృష్ణుడు కూడా ఉన్నాడని రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దాంతో కృష్ణుడు స్పందించాడు. కొద్ది రోజుల క్రితం నల్గొండ నుండి మీ అభిమానిని ఫోన్ చేస్తున్నాను ఒకసారి మా ఇంటికి రావాలి మీరు అని చేశారు. దాంతో అనుమానం వచ్చిన నేను ఆ నెంబర్ ని బ్లాక్ చేసాను ఇక అత్యాచారం కేసులో ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని అయితే అందులో నాకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టాడు.

ఒకవేళ పంజాగుట్ట పోలీసులు విచారణకు రమ్మంటే తప్పకుండా సహకరిస్తానని తెలిపాడు కృష్ణుడు. ఇప్పటి వరకైతే పోలీసుల నుండి నాకు ఎలాంటి ఫోన్ రాలేదని స్పష్టం చేసారు కృష్ణుడు. టాలీవుడ్ లో నటుడు కృష్ణుడు కి చాలా మంచి పేరుంది. తన పని తాను చేసుకుంటూ, అందరికీ మర్యాద ఇస్తూ మంచి మనసున్న వ్యక్తిగా పేరుంది. అయితే ఇలాంటి వాటిలో పేరు రావడం అంటే కొంతమంది ఎవరో తెలిసి తెలియని వాళ్ళ అత్యుత్సాహం కొద్దీ కృష్ణుడు లాంటి మంచి వాళ్ళు పలు ఇబ్బందులకు గురౌతున్నారు.

మునుపటి వ్యాసంప్రభాస్ – అనుష్క లు కలిసి ఉండాలంటున్న భామ
తదుపరి ఆర్టికల్విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి