హీరో రామ్ కు వార్నింగ్ ఇచ్చిన ఏసీపీ

0
63
ram pothineni

విజయవాడ రమేష్ ఆసుపత్రి విచారణ విషయంలో హీరో రామ్ పదేపదే పోస్ట్ లు పెడుతుండటంతో విజయవాడ ఏసీపీ తీవ్రంగా స్పందించాడు. హీరో రామ్ ఇంకా ట్వీట్ లు చేయడం ఆపకపోతే అతడికి కూడా నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించాడు దాంతో రామ్ తన ట్వీట్ ల పర్వానికి ముగింపు పలికాడు. విజయవాడ నగరంలో రమేష్ ఆసుపత్రికి చెందిన కోవిడ్ పేషేంట్ లను స్వర్ణ ప్యాలెస్ లో ఉంచి చికిత్స అందిస్తున్న సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగి పది మంది మరణించారు. కాగా ఆ సంఘటనలో డాక్టర్ రమేష్ చౌదరిని బాధ్యుడిని చేస్తూ విజయవాడ ఏసీపీ నోటీసులు జారీ చేసాడు.

అయితే డాక్టర్ రమేష్ విచారణకు హాజరుకాకుండా పోలీసులను ఇబ్బంది పెడుతుండడంతో యాక్షన్ లోకి దిగాలని చూస్తున్న క్రమంలో హీరో రామ్ సీఎం జగన్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. పైగా విచారణ పక్కదారి పడుతోందని ట్వీట్ చేయడంతో స్పందించాడు ఏసీపీ సూర్యచంద్రరావు. మరోసారి ట్వీట్ చేసి విచారణకు ఆటంకం కలిగిస్తే రామ్ పై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో రామ్ స్పందించాడు. న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం ఉందని , ఇకపై ఈ విషయంలో ఎలాంటి పోస్ట్ లు పెట్టనని పోస్ట్ చేసాడు రామ్. అయితే డాక్టర్ రమేష్ విషయంలో రామ్ ఎందుకు స్పందించాడో తెలుసా ……… డాక్టర్ రమేష్ రామ్ కు బాబాయ్ అవుతాడు అందుకే. 

మునుపటి వ్యాసంకండోమ్ భామకు అవకాశాలు కావాలట
తదుపరి ఆర్టికల్కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న విజయ్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి