ఆచార్య మోషన్ పోస్టర్ వచ్చేసింది

0
47
achari

 

అనుకున్నట్లుగానే ఈరోజు ఆచార్య మోషన్ పోస్టర్ విడుదల అయ్యింది. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొద్దిసేపటి క్రితం ఆచార్య లోగో తో పాటుగా మోషన్ పోస్టర్ విడుదల చేసారు. విప్లవకారుడి గెటప్ లో ఉన్న చిరంజీవి లుక్ మెగా అభిమానులను విశేషంగా అలరించేలా ఉంది. అయితే గొప్పగా లేకపోవడంతో కాబోలు కొంతమంది ఈ మోషన్ పోస్టర్ ని సైతం డిస్ లైక్ కొడుతున్నారు. లైక్స్ బాగానే ఉన్నాయి అయితే డిస్ లైక్స్ కూడా ఇప్పటి వరకే వెయ్యి దాటాయి.

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నక్సలిజంతో ప్రభావితమయ్యే వ్యక్తిగా , అన్యాయాల్ని ప్రశ్నించే తిరుగుబాటుదారుడిగా నటిస్తున్నాడు. సామాజిక సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే బ్లాక్ బ్యూటీ రెజీనా కాసాండ్రా ఓ ఐటెం సాంగ్ చేస్తోంది ఈ చిత్రంలో.

చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే కరోనా వల్ల ఇప్పట్లో ఆచార్య షూటింగ్ కష్టమే అని తెలుస్తోంది. కరోనా మొత్తం తగ్గిన తర్వాత ఎలాంటి భయం ఉండదు అని అనుకున్నప్పుడే ఆచార్య పట్టాలెక్కనుంది అందుకే టీజర్ కట్ చేసినప్పటికీ చిరంజీవి ఇప్పుడే వద్దు అని వారించడంతో టీజర్ కాకుండా కేవలం మోషన్ పోస్టర్ మాత్రమే విడుదల చేసారు.

మునుపటి వ్యాసంమగాళ్లు ఆడవాళ్ళ కాళ్ళు పిసకాలాట హాట్ భామ సలహా
తదుపరి ఆర్టికల్5 కోట్ల భారీ విరాళం అందించిన హీరో సూర్య
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి