కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రగతి

0
66
praghathi aunty

 

హీరోలకు అమ్మ , వదినగా నటిస్తున్న భామ ప్రగతి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరోయిన్ లు మాత్రమే కాదు సాధారణ హీరోయిన్ లు సైతం కాస్టింగ్ కౌచ్ బాధితులని కుండబద్దలు కొట్టింది నటి ప్రగతి. సినిమారంగంలో కాస్టింగ్ కౌచ్ బారిన పడని హీరోయిన్ అంటూ ఎవరూ లేరని అయితే కొంతమంది స్టార్ హీరోయిన్ లుగా మారడంతో అటువంటి వాళ్ళు ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడరు , ఆరోపణలు చేయరు ఎందుకంటే వాళ్ళు స్టార్ డం పొందారు కాబట్టి ……కానీ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడేవాళ్ళు , ఆరోపణలు చేసేవాళ్ళు మాత్రం సక్సెస్ పొందని వాళ్ళు మాత్రమే అంతే తేడా కానీ కాస్టింగ్ కౌచ్ లో ఎలాంటి తేడా లేదని కుండబద్దలు కొట్టింది ప్రగతి.

80 వ దశకంలో తమిళనాట హీరోయిన్ గా నటించింది ప్రగతి. అప్పట్లో ఓ హీరో ప్రగతి తో అసభ్యంగా ప్రవర్తించడంతో సినిమాలకు స్వస్తి పలికింది. ఆ తొందరలో పెళ్లి చేసుకుంది. ఒక బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత కాపురంలో కలతలు చెలరేగడంతో అతడితో విడిపోయింది. తనతో పాటు ఒక కొడుకు కూడా కావడంతో మరో పని రాదు కాబట్టి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. ప్రగతిని కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేలా చూసారట. పలువురు దర్శక నిర్మాతలు తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే గట్టిగా చెప్పెదట. కుదరకపోతే ఆ సినిమా నుండి తప్పుకునేదట. ఈ విషయాలను బయటపెట్టేసి కాస్టింగ్ కౌచ్ పై మళ్లీ వార్తలు వచ్చేలా చేస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి