హీరోగా 13 ఏళ్ళు పూర్తి చేసుకున్న మెగా హీరో

0
32
chirutha movie completed 13 years

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి 13 సంవత్సరాలు పూర్తయ్యింది. సరిగ్గా 13 ఏళ్ల క్రితం చరణ్ హీరోగా నటించిన మొట్ట మొదటి చిత్రం ” చిరుత ” విడుదల అయ్యింది. 2007 సెప్టెంబర్ 28 న చరణ్ నటించిన చిరుత చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మొదటి సినిమాలోనే యాక్షన్ హీరోగా తనని తాను నిరూపించుకున్నాడు చరణ్. ఫైట్స్ తో పాటుగా డ్యాన్స్ లో కూడా అదరగొట్టాడు దాంతో మెగాస్టార్ వారసుడిగా చరణ్ సత్తా చాటడం ఖాయమని భావించారు సినీ విశ్లేషకులు.
వాళ్ళ అంచనాలను నిజం చేస్తూ తన రెండో చిత్రంతోనే ప్రభంజనం సృష్టించాడు చరణ్. తన రెండో చిత్రాన్ని ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసాడు చరణ్ . ఆ చిత్రమే ” మగధీర ”. 2009 లో విడుదలైన మగధీర టాలీవుడ్ ని షేక్ చేసింది. అంతకుముందు వరకు తెలుగు సినిమా స్టామినా కొంతవరకే పరిమితం కానీ మొట్టమొదటి సారి టాలీవుడ్ కు ఎల్లలు లేవని కలెక్షన్ల వర్షంతో నిరూపించిన చిత్రం మగధీర. కాలభైరవ పాత్రలో చరణ్ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. రెండో చిత్రంతోనే యాక్షన్ హీరోగానే కాకుండా మంచి నటుడిగా కూడా సత్తా చాటే గోల్డెన్ ఛాన్స్ లభించింది చరణ్ కు.

మొత్తంగా ఈ 13 సంవత్సరాల కాలంలో మొత్తం 14 చిత్రాల్లో నటించాడు. మరో రెండు చిత్రాలు ఆచార్య , ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీద ఉన్నాయి. 13 ఏళ్ల కాలంలో 14 చిత్రాల్లో నటించగా అందులో 9 చిత్రాలు విజయాలు సాధించాయి. ఇక వీటిలోని తండ్రి చిరంజీవితో కలిసి నటించడం విశేషం. తాజాగా మరోసారి ఆచార్య చిత్రంలో మరోసారి కలిసి నటిస్తున్నాడు చరణ్. దాంతో మెగా అభిమానులను మరింత అలరించడం ఖాయం. మరోసారి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు చరణ్ . ఈసారి అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తుండటం మరింతగా మెగా అభిమానులను జోష్ లో ముంచెత్తుతోంది. ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించే చిత్రమని రికార్డుల మోత మోగడం ఖాయమని భావిస్తున్నారు మెగా అభిమానులు.

మునుపటి వ్యాసంఅనసూయ లేటెస్ట్ ఫొటోస్
తదుపరి ఆర్టికల్ముమైత్ ఖాన్ మోసం చేసిందంటున్న క్యాబ్ డ్రైవర్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి