పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్

0
62
pawan kalyan birthday treat

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్

సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు దాంతో ఆ సందర్భంగా భారీ ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు పవన్ కల్యాణ్ దర్శ నిర్మాతలు. తాజాగా పవన్ కల్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో మరో పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. వకీల్ సాబ్ షూటింగ్ పార్ట్ దాదాపుగా అయిపోవచ్చింది కొంత వర్క్ మాత్రమే బ్యాలెన్స్ వర్క్ ఉంది. కానీ క్రిష్ సినిమా మాత్రం రెండు షెడ్యూల్ లు మాత్రమే జరిగాయి.

సెప్టెంబర్ 2 న పవన్ కల్యాణ్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజున వకీల్ సాబ్ తో పాటుగా క్రిష్ సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఒకే రోజున రెండు సినిమాల విశేషాలు అంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ అనే చెప్పాలి. ఈ రెండు సినిమాలతో పాటుగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా గురించి కూడా ఏదైనా అప్ డేట్ ఉండనుందని తెలుస్తోంది అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ని మరింతగా సంతోషంలో ముంచెత్తే విషయమే అన్నమాట.

అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమాలు ఇవి. ఇంతకుముందు ఒక సినిమా తర్వాత ఒకటి చేసేవాడు కానీ ఒకేసారి మూడు సినిమాలు చేస్తూ అభిమానులను మాత్రమే కాకుండా టాలీవుడ్ దర్శక నిర్మాతలను అలాగే నటీనటులను కూడా షాక్ అయ్యేలా చేసాడు. వకీల్ సాబ్ బాలీవుడ్ పింక్ రీమేక్ చిత్రం కాగా క్రిష్ , హరీష్ శంకర్ ల సినిమాలు మాత్రం స్ట్రెయిట్ చిత్రాలు. హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ గా ప్రభంజనం సృష్టించాడు పవన్ కల్యాణ్. ఇన్నేళ్ల తర్వాత ఆ కాంబినేషన్ లో సినిమా అనగానే పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఇక ఈ పుట్టినరోజు కు మరింత ఫ్యాన్స్ ని ఖుషీ చేయనున్నాడు పవన్.

మునుపటి వ్యాసంటాలీవుడ్  సింగర్ తల్లి మృతి
తదుపరి ఆర్టికల్మహేష్ అందాన్ని చూస్తూ అలా ఉండిపోయిందట
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి