అక్కినేని ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే కాంబినేషన్

0
37
akhil surendra reddy combination movie

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చే కాంబినేషన్ సెట్ అయ్యింది. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు పొందిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. అక్కినేని  అఖిల్ హీరోగా అఖిల్ అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో భారీ అంచనాలు ఉండేవి అఖిల్ పై అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది దాంతో అఖిల్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక రెండో చిత్రంగా హలో అంటూ పలకరించాడు అఖిల్.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో చిత్రం యావరేజ్ అయ్యింది. ఇక మూడో చిత్రంగా మిస్టర్ మజ్ను అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. దాంతో అక్కినేని అభిమానుల్లో అఖిల్ పట్ల కలవరపాటు మొదలయ్యింది. ఇక ఇప్పుడేమో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటూ నాలుగో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం యూత్ ని అలరిస్తుందా ? లేదా ? చూడాలి.

ఇలాంటి పరిస్థితుల్లో అఖిల్ 5 వ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అని ప్రకటించడంతో అక్కినేని అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సురేందర్ రెడ్డి  తప్పకుండా అఖిల్ ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రెజెంట్ చేస్తాడని ఆశిస్తున్నారు. ఇక అఖిల్ కూడా సాలిడ్ హిట్ కోసం చాలా కసిగా ఉన్నాడట. అఖిల్ తపనకు సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ తోడైతే ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ ఈ ఇద్దరినీ కలిపి అక్కినేని అభిమానులకు , సినిమా ప్రేక్షకులకు మంచి పసందైన విందు ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి