ఆ సినిమా ప్రభంజనానికి 17 ఏళ్ళు

0
50

సరిగ్గా 17 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదల అయ్యింది సింహాద్రి చిత్రం. 2003 జులై 9 న విడుదలైన ఆ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి సరికొత్త రికార్డుల మోత మోగించింది. నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అప్పుడు ఎన్టీఆర్ వయసు ఎంతో తెలుసా….. కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి అటు ఎన్టీఆర్ కెరీర్ ని ఇటు రాజమౌళి కెరీర్ ని మలుపు తిప్పింది. ఎన్టీఆర్ హీరోగా నటించగా భూమిక హీరోయిన్ గా నటించింది. ఎం ఎం కీరవాణి అందించిన పాటలు నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. అసలు ఈ సింహాద్రి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ తో చేయాలని భావించాడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. కానీ అప్పట్లో రాజమౌళి స్టూడెంట్ నెం 1 చిత్రానికి మాత్రమే దర్శకత్వం వహించి ఉన్నాడు.

ఆ కారణమో లేక మరో కారణమో కానీ బాలయ్య సింహాద్రి చిత్రాన్ని నిరాకరించాడు. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ తో దొరస్వామి నిర్మిస్తున్న చిత్రం పక్కాగా రావడం లేదని భావించి ఆ దర్శకుడు ని పక్కన పెట్టి రాజమౌళి కి ఛాన్స్ ఇచ్చాడు. కట్ చేస్తే అదే కథని ఎన్టీఆర్ తో చేసాడు. ఇంకేముంది రికార్డుల మోత మోగిపోయింది తెలుగునాట. సింహాద్రి చిత్రం తర్వాత రాజమౌళి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈరోజు యావత్ భారతదేశం లోనే అగ్రశ్రేణి దర్శకుడు గా అవతరించాడు జక్కన్న. ఈరోజుకి సరిగ్గా 17 ఏళ్ళు పూర్తయ్యాయి సింహాద్రి చిత్రం విడుదల అయి. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో ఆర్ ఆర్ ఆర్ వస్తోంది. ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపడం ఖాయంగా భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

మునుపటి వ్యాసంసీనియర్ నటి ఆరోగ్యం విషమం : ఆసుపత్రిలో చికిత్స
తదుపరి ఆర్టికల్పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పవన్ ఇజ్జత్ తీసేలా ఉందే
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి