మహేష్ దూకుడుకు 9 ఏళ్ళు

0
27
dookudumovie completed 9 years

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు చిత్రం ఈనాటితో సరిగ్గా 9 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 2011 సెప్టెంబర్ 23 న దూకుడు చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టింది దూకుడు చిత్రం.  శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట , గోపీనాథ్ ఆచంట , అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. మహేష్ బాబు తో సినిమా తీయడమే గొప్ప అనుకుంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్ర నిర్మాతల సంతోషానికి అంతేలేకుండాపోయింది.

పక్కా ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో దూకుడు చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. దాంతో మహేష్ బాబు చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలవడమే కాకుండా టాలీవుడ్ రికార్డులను దుమ్ము దులిపేసి నెంబర్ వన్ గా నిలిచింది దూకుడు. ఇక దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్ లో కూడా దూకుడు నెంబర్ వన్ గా నిలిచింది దాంతో ఆ సినిమా తనకు ఎప్పటికి స్పెషల్ అని అంటున్నాడు. తాజాగా దూకుడు చిత్రం 9 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఆ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు శ్రీను వైట్ల.

ఇక మహేష్ బాబు అభిమానులు అయితే దూకుడు చిత్రం 9 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పండగ చేసుకుంటున్నారు. దూకుడు చిత్రంలోని పాటలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దూకుడు చిత్రానికి అన్నీ సమపాళ్లలో కుదిరాయి. పాటలు , నేపథ్య సంగీతం , అద్భుతమైన డైలాగ్స్ , హీరోయిన్ సమంత అందాలు , ఎంటర్ టైన్ మెంట్ , విలనిజం , మహేష్ లుక్స్ ఇలా అన్నీ పక్కాగా కుదరడంతో దూకుడు బాక్సాఫీస్ ని దున్నేసింది. అయితే ఇదే కాంబినేషన్ లో ( శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ పతాకంపై)  వచ్చిన ఆగడు మాత్రం దెబ్బకొట్టింది. 

 

మునుపటి వ్యాసంకోర్టు చిక్కుల్లో హీరో విశాల్ సినిమా
తదుపరి ఆర్టికల్కేటీఆర్ కు సవాల్ గా మారనున్న ఎన్నికలు
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి