పరకాల మారణహోమానికి 73 ఏళ్ళు

0
39
telangana map

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లా పరకాలలో 73 సంవత్సరాల క్రితం మారణహోమం జరిగింది. జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన జరిగి 22 మంది మృత్యువాత పడటంతో ఆ సంఘటనని దక్షిణ భారతదేశ జలియన్ వాలా బాగ్ గా చరిత్రకారులు చెబుతారు. భారతదేశానికి 1947 లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతంకు మాత్రం స్వాతంత్య్రం లభించలేదు. నైజాం నవాబ్ పరిపాలనలో ఉండేది తెలంగాణ ప్రాంతం. తెలంగాణ పల్లెల్లో రజాకార్లు సాగించిన దమనకాండ అంతా ఇంతా కాదు.

మహిళలపై అత్యాచారం చేయడం , నగ్నంగా బతుకమ్మ ఆడించడం యువకులను , ముసిలివాళ్ళని కొట్టడం , చంపడం లాంటి కిరాతకమైన పనులన్నీ చేసేవాళ్ళు రజాకార్లు. ఎంతగా నిర్బంధం ఉన్నప్పటికీ మాకు స్వేచ్ఛా స్వాతంత్య్రం కావాలని నినదించారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడంతో 1947 సెప్టెంబర్ 2 న పరకాలలో జాతీయ జెండా ఎగరేయాలని చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు ప్రజలు. అయితే పరకాల ప్రాంతంలో పెద్ద ఎత్తున జనాలు గుమికూడి భారతీయ జెండా ఎగరవేస్తారని సమాచారం అందుకున్న రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడికక్కడే  22 మంది చనిపోయారు.

ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. దాంతో మరో జలియన్ వాలా బాగ్ సంఘటనగా చెబుతారు. అయితే అప్పటి మృత వీరులకు గుర్తుగా 1998 లో అప్పటి బీజేపీ కురువృద్ధుడు అద్వానీ చేత అమరధామం ఏర్పాటు చేయించాడు బీజేపీ నేత , మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు. పరకాలలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు గుర్తుగా అమరధామం సాక్షీభూతంగా నిలిచింది. అమరధామంని చూస్తూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు ఆనాటి సంఘటనని ప్రత్యక్షంగా చూసినవాళ్లు. 

మునుపటి వ్యాసంప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ
తదుపరి ఆర్టికల్ఎం ఎల్ ఏ క్యాంప్ కార్యాలయం కూల్చివేత
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి