తెలంగాణలో కరోనా కల్లోలం: ఆరుగురు మృతి

0
20
Coronavirus death in Telangana

తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా తో తెలంగాణలో మృతుల సంఖ్య 6 కు చేరింది. కరోనా పాజిటివ్ కేసులు నెగెటివ్ గా మారాయి అన్న సంతోషకర వార్త ని ఎంజాయ్ చేయకుండానే ఒకేసారి మృతుల సంఖ్య పెరగడంతో ఒక్కసారిగా తెలంగాణలో కలవరం మొదలయ్యింది. దాంతో ఢిల్లీ సమీపంలోని నిజాముద్దీన్ కు మతపరమైన కార్యక్రమాల కోసం వెళ్లిన వ్యక్తులను పట్టుకునే పనిలో పడ్డారు అధికారులు.

ఈనెల 13 నుండి 15 వరకు జరిగిన మతపరమైన కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా 3000 మందికి పైగా హాజరయ్యారట. అయితే అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 800 మంది హాజరయ్యారట. విదేశాల నుండి వచ్చిన వాళ్లతో కరోనా సోకిన శాతం చాలా తక్కువ కానీ నిజాముద్దీన్ కు వెళ్లొచ్చిన వాళ్ళ వల్లే ఎక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో అక్కడికి వెళ్లొచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లారు ? ఎవరెవరిని కలిశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 200 మంది మాత్రమే తెలిసారు దాంతో మిగతా వాళ్ళను పట్టుకునే పనిలో పడ్డారు అధికారులు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి