50 ఏళ్ళు రాబోతున్న ఇంకా పెళ్లి ఊసెత్తని భామ

0
30
tabu going to 50 years

టాలీవుడ్ మూవీ న్యూస్,ముంబయి,ఒంటి మీదకు 50 ఏళ్ళు రాబోతున్నాయి హాట్ భామ టబుకు అయినప్పటికీ పెళ్లి ఊసెత్తడమే లేదు ఈ భామ. ప్రస్తుతం ఈ భామ వయసు 49 సంవత్సరాలు. 1971 నవంబర్ 4 న హైదరాబాద్ లో ముస్లిం కుటుంబంలో జన్మించింది టబు. అంటే వచ్చే నవంబర్ కు 50 వ వడిలో పడుతుందన్న మాట. ఈ భామ పూర్తి పేరు టబస్సుమ్ ఫాతిమా హష్మీ . హైదరాబాద్ మూలాలు ఉన్న ఈ భామ కు పెళ్లి పై విరక్తి కలగడానికి కారణం ఏంటో తెలుసా ……… తల్లిదండ్రులు విడిపోవడమే. టబు తల్లిదండ్రులు విడిపోవడంతో పాటుగా ప్రేమలో కూడా విఫలం అయ్యింది దాంతో ఇక పెళ్లి పై అంతగా దృష్టి పెట్టలేదు.


హైదరాబాద్ భామ అయినప్పటికీ ఎక్కువగా ఉండేది మాత్రం ముంబైలోనే. తెలుగు సినిమాల్లో కూడా నటించింది కానీ ఎక్కువగా ఈ భామ దృష్టి అంతా బాలీవుడ్ సినిమాలపైనే. అలాగే కమర్షియల్ సినిమాలలో నటించడం కంటే విభిన్నమైన చిత్రాల్లో నటించాలని ఎక్కువగా తపనపడుతుంది అందుకే ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో నటించలేదు టబు.

అయితే ఇన్నాళ్లు ఎలాగోలా నెట్టుకుంటూ వచ్చింది కానీ భవిష్యత్తులో తప్పకుండా ఒక తోడు అవసరం కాబట్టి ఇప్పటికైనా పెళ్లి చేసుకో అని బంధుమిత్రులు ఉచిత సలహా ఇస్తూనే ఉన్నారట టబుకు కానీ ఈ భామ మాత్రం పెళ్లి ఊసెత్తితే చాలు అంతెత్తున లేస్తోందట. పెళ్లి మీద అయిష్టత ఉండటంతో ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదు. అయితే అడపా దడపా ప్రేమలో పడుతూనే ఉంది ఈ భామ. ఇప్పటికైనా టబు ఓ ఇంటిదైతే అంతకుమించిన సంతోషం ఏముంటుంది.

మునుపటి వ్యాసంసినిమారంగంలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు
తదుపరి ఆర్టికల్అడల్ట్ కంటెంట్ తో రవిబాబు ‘క్రష్’ ఫస్ట్ పీప్
Satyam Gorantla
సత్యం గోరంట్ల అను నేను ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 2005 నుండి చేస్తున్నాను. మొదట తెలుగు ఫిల్మ్ ట్రేడ్ గైడ్ అనే వార పత్రికలో లో ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. ఆ తర్వాత ఆనందం అనే సినిమా మ్యాగజైన్ లో కొంతకాలం పని చేసాను. హీరోయిన్ భూమిక సంస్థ అయిన మాయానగర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో కూడా కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. R tv లో కొంతకాలం, RK న్యూస్ ఛానల్ లో కొంతకాలం ఫిల్మ్ జర్నలిస్ట్ గా పనిచేశాను. టాలీవుడ్ స్పార్క్ డాట్ కామ్ లో కొద్ది నెలల, ఆ తర్వాత వాక్డౌట్ లో కొంతకాలం పనిచేశాను. ఇక టాలీవుడ్ డాట్ నెట్ లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దాదాపు 6 సంవత్సరాలు పనిచేశాను. గత ఏడాది కాలంగా టాలీవుడ్ మూవీ న్యూస్ డాట్ కామ్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. మొత్తంగా ఫిల్మ్ జర్నలిస్ట్ గా దాదాపు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి