40 కోట్ల బడ్జెట్ 125 కోట్ల వసూళ్లు

0
78
magadheera movie still

సరిగ్గా 11 సంవత్సరాల క్రితం 2009 జులై 30 న విడుదలైన చిత్రం మగధీర. రాంచరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో రావు రమేష్ , శ్రీహరి ,శరత్ బాబు తదితరులు నటించారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన మగధీర ఇప్పటికి కూడా పలు సంచలనాలను తన పేరిట లిఖించుకుంది. అప్పట్లోనే 40 కోట్ల బడ్జెట్ అంటే భయపడ్డారు. ఔరా ….. తెలుగు సినిమాకు 40 కోట్ల బడ్జెట్ అవసరమా ? అని కానీ సినిమా విడుదల అయ్యాక అప్పట్లోనే అందునా భారీ వర్షాల సమయంలో 125 కోట్ల భారీ వసూళ్లు సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది.

400 ఏళ్ల క్రితం కథ అంటూ మొదలు పెట్టి ఇప్పటి తరం కోసం పునర్జన్మ అంటూ రాజమౌళి అల్లిన కథ కు కథనానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వసూళ్ల వర్షం కురిపించారు. చరణ్ మగధీరుడు గా నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. కాజల్ అగర్వాల్ రాజకుమారి పాత్రలో కుర్రాళ్ళని విపరీతంగా మెప్పించింది. ఇక ఈ సినిమాలో శ్రీహరి వేసిన షేర్ ఖాన్ హైలెట్ అనే చెప్పాలి. ఉన్న పాత్ర కొంతసేపే అయినప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 2009 లో విడుదలైన మగధీర చిత్రం తెలుగు సినిమా స్థాయిని , ఖ్యాతిని పెంచింది. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం విడుదల అయిన సినిమా కావడంతో మెగా కుటుంబం సంతోషంగా ఉంది. మగధీర రోజులను గుర్తుకు తెచ్చుకుంటోంది. మరో కొసమెరువు ఏంటో తెలుసా…… బంగారు కోడిపెట్టా అనే పాటకు ముందు మెగాస్టార్ చిరంజీవి ఓ చిన్న ఝలక్ ఇస్తూ కనిపించడం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి