ఆ సంచలన చిత్రానికి 31 సంవత్సరాలు

0
37
shiva movie completed 31 years

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్- అక్కినేని నాగార్జున హీరోగా నటించిన శివ చిత్రానికి నేటికీ సరిగ్గా 31 సంవత్సరాలు. 1989 అక్టోబర్ 5 న శివ చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా పోకడని పూర్తిగా మార్చేసిన చిత్రం శివ. అంతకుముందు వరకు మూస కథలు , కథనాలతో సాగుతున్న తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సరికొత్త ఊపిరి పోసిన చిత్రం ఈ శివ. ఇక నాగార్జున ని తిరుగులేని స్టార్ హీరోని చేసిన చిత్రం కూడా శివనే. ఈ సినిమా ద్వారా రాంగోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

శివ చిత్రం స్పూర్తితో చాలామంది నటీనటులు , దర్శకులు కావడానికి చిత్ర పరిశ్రమకు క్యూ కట్టారంటే అతిశయోక్తి కాదు అంతగా ప్రభావితం చేసింది శివ చిత్రం. ఈ చిత్రం విడుదలై 31 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక ఈరోజుకి 31 ఏళ్ళు పూర్తి కావడంతో ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్.

నాగార్జున సరసన అమల నటించగా కీలక పాత్రల్లో రఘువరన్ , చిన్నా , శుభలేఖ సుధాకర్ , జేడీ , తనికెళ్ళ భరణి , కోట శ్రీనివాస్ రావు. గొల్లపూడి మారుతీరావు , మురళీమోహన్ , రాంజగన్ , ఉత్తేజ్ , బ్రహ్మాజీ , నిర్మలమ్మ , సాయిచంద్ తదితరులు నటించారు. అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మించడం విశేషం. అప్పటి వరకు ఎలాంటి సినిమాలు చేస్తున్నానా ? అంటూ కుమిలిపోతున్న సమయంలో వర్మ ఈ కథ చెప్పాడట దాంతో మరో ఆలోచన లేకుండా శివ చిత్రాన్ని చేసాడు నాగార్జున. కట్ చేస్తే 1989 అక్టోబర్ 5 న విడుదలైన శివ తెలుగునాట సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టింది. ఎస్ . గోపాల్ రెడ్డి అందించిన ఫోటోగ్రఫీ , ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి