బొబ్బిలి రాజా సంచలనానికి 30 ఏళ్ళు

0
27
bobbiliraja copleated 30years

టాలీవుడ్ మూవీ న్యూస్,హైద్రాబాద్విక్టరీ వెంకటేష్ హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” బొబ్బిలి రాజా ”. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలై తెలుగునాట ప్రభంజనం సృష్టించింది. 1990 సెప్టెంబర్ 14 న విడుదలైన బొబ్బిలి రాజా వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వెంకటేష్ అప్పటికే  స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ బొబ్బిలి రాజా మాత్రం గట్టి పునాది వేసింది దాంతో టాలీవుడ్ లో టాప్ 4 హీరోలలో ఒకరిగా నిలిచాడు వెంకటేష్.

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ భామ దివ్యభారతిని తెలుగుకు పరిచయం చేసారు. వెంకటేష్ ఎక్కువగా కొత్త హీరోయిన్ లను అందునా ఉత్తరాది భామలను హీరోయిన్ లుగా పరిచయం చేసే అలవాటు ఉండేది తన చిత్రాలతో. అలాగే బొబ్బిలి రాజా చిత్రంతో అందాల ముద్దుగుమ్మ దివ్యభారతిని పరిచయం చేసాడు. ఈ సినిమాలో మెయిన్ హైలెట్ దివ్యభారతి అందాలు అనే చెప్పాలి. దివ్యభారతి అందాలను మళ్ళీ మళ్ళీ చూడాలని వచ్చిన వాళ్లే ఎక్కువ అని అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది ఈ విషయం.

కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభతో పాటుగా ఇళయరాజా అందించిన సంగీతం కూడా హైలెట్ గా మారింది. ముఖ్యంగా ” బలపం పట్టి భామ ఒళ్ళో ” అనే పాట ఇప్పటికి కూడా సంచలనమే. ఈ పాటతో పాటుగా మిగిలిన పాటలు కూడా బొబ్బిలి రాజా బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం అయ్యాయి. పరుచూరి బ్రదర్స్ అందించిన సంభాషణలు కూడా బాగున్నాయి. ఇక నిర్మాతగా దగ్గుబాటి సురేష్ బాబుకు మొదటి చిత్రం ఇది , మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సురేష్ బాబు. 1990 లో విడుదలైన బొబ్బిలి రాజా చిత్రం టాలీవుడ్ ని షేక్ చేసింది వసూళ్ల సునామీ సృష్టించింది. మరో ముఖమైన విషయం ఏంటంటే ……. సీనియర్ నటి వాణిశ్రీ ఈ చిత్రంలో వెంకటేష్ అత్తగా నటించడం ఆమె చెప్పిన డైలాగ్స్ కూడా అప్పట్లో సంచలనం సృష్టించాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి