అర్జున్ రెడ్డి సంచలనానికి 3 ఏళ్ళు

0
67
3 rd anniversary of Arjuna reddy

అర్జున్ రెడ్డి సంచలనానికి 3 ఏళ్ళు

విజయ్ దేవరకొండని స్టార్ హీరోగా మార్చిన చిత్రం అర్జున్ రెడ్డి. టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన అర్జున్ రెడ్డి 2017 ఆగస్ట్ 25 న విడుదల అయ్యింది. సాదా సీదా చిత్రంగా విడుదల అయిన అర్జున్ రెడ్డి తెలుగునాట ట్రెండ్ మార్చిన చిత్రంగా నిలిచింది. యూత్ ని విపరీతంగా ఆకర్షించిన అర్జున్ రెడ్డి చిత్రం కేవలం యూత్ ని మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖులను కూడా విశేషంగా అలరించింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే అర్జున్ రెడ్డి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సందీప్ రెడ్డి వంగా కెరీర్ ని మాత్రమే కాకుండా విజయ్ దేవరకొండ కెరీర్ ని కూడా పూర్తిగా మార్చేసింది. సందీప్ రెడ్డి వంగాకు ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా తడబాటు లేకుండా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అసలు ఈ సినిమా కోసం పలువురు హీరోలను అలాగే పలువురు నిర్మాతలను సందీప్ రెడ్డి వంగా కలిసాడు. కానీ అర్జున్ రెడ్డి పట్ల అంతగా సానుకూలంగా ఎవరూ లేకపోవడంతో ధైర్యం చేసి హన్మకొండ లో ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ అర్జున్ రెడ్డి చిత్రాన్ని తీశారు. కేవలం 4 కోట్ల ఖర్చుతో సినిమా చేస్తే కేవలం తెలుగులోనే 51 కోట్ల షేర్ సాధించి చరిత్ర సృష్టించింది. అర్జున్ రెడ్డి భారీ విజయం సాధించడంతో రీమేక్ రైట్స్ తో పాటుగా డబ్బింగ్ రైట్స్ అలాగే శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చింది.

ఇక ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు సందీప్ రెడ్డి అక్కడ ఏకంగా 300 కోట్ల వసూళ్ళని సాధించి ట్రెడ్ విశేషకులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి అతడి నట జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక్కసారిగా స్టార్ డంతో పాటుగా అతడి స్టేటస్ ని కూడా మార్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ స్టార్ ఎవరంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ. షాలిని పాండే హీరోయిన్ గా నటించింది ఈ చిత్రంలో. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కు హీరో విజయ్ దేవరకొండ కు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు మాత్రం షాలిని పాండే కు రాలేదు పాపం.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి