ప్రభాస్ 3 సినిమాలు 11 వందల కోట్ల బడ్జెట్

0
23
adhipursh prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న 3 చిత్రాల బడ్జెట్ ఏకంగా 11 వందల కోట్లను తాకుతోంది. అయితే ఈ బడ్జెట్ ఆ సినిమాలు పూర్తి అయ్యేనాటికి మరింతగా పెరగొచ్చు కూడా. 3 సినిమాలకు 11 వందల కోట్ల బడ్జెట్ ఏంటి ? అని అనుకుంటున్నారా ? మూడు సినిమాలకు గాను ఈ పదకొండు వందల బడ్జెట్ అవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ చిత్ర బడ్జెట్ 200 కోట్లు కాగా ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్న సైన్స్ ఫిక్షన్ కథకు ఏకంగా 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు.

వైజయంతి మూవీస్ పతాకంపై అగ్ర నిర్మాత అశ్వనీదత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె రెమ్యునరేషన్ ఏకంగా 30 కోట్లు ఇక ప్రభాస్ కు కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. తెలుగు , తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాషలతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఇతర భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ కు ఇది 21 వ సినిమా కావడం విశేషం.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ 22 వ సినిమా ”ఆది పురుష్ ” భారీ ఎత్తున రూపొందనుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇలా మొత్తంగా ప్రభాస్ నటిస్తున్న 3 సినిమాల విలువ ఇప్పటి వరకు 11 వందల కోట్లు. అయితే ఈ బడ్జెట్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్నా బడ్జెట్ ఇది సినిమా పట్టాలెక్కిన తర్వాత అదనపు ఖర్చులు పెరగొచ్చు కూడా. ఒకవేళ బడ్జెట్ కంట్రోల్ లో ఉన్నా మొత్తంగా 11 వందల కోట్లు అన్నమాట. దర్శక నిర్మాతలు ప్రభాస్ పై భారీగానే ఆశలు పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. కోట్ల కొద్దీ డబ్బులు పెడుతున్నారు . 

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి