ఆ చిత్రంలో నటించడానికి 3 కోట్లు డిమాండ్ చేసిందట

0
50
anushka shetty

తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటించడానికి అందాల భామ అనుష్క ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో మొదట ఈ రెమ్యునరేషన్ విని షాక్ అయినప్పటికీ ఆ తర్వాత అనుష్కకు సౌత్ లో ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించారట. దాంతో కరోనా తగ్గిన తర్వాత అనుష్క చేయబోయే సినిమా ఇదే కానుందని తెలుస్తోంది. తమిళనాట విజయ్ సేతుపతి కి మంచి ఇమేజ్ ఉంది. హీరోగానే నటించాలి అనే నియమం పెట్టుకోకుండా ఎలాంటి పాత్ర నైనా చేస్తూ విభిన్నమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

అనుష్క విషయానికి వస్తే గ్లామర్ హీరోయిన్ గా ఎంటర్ అయి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాగే స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా స్టార్ డం అందుకుంది. తనదైన స్థాయి కలిగిన చిత్రాలతో సత్తా చాటింది.తాజాగా సైలెన్స్  అనే చిత్రం దక్షిణాదిలో నాలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. తెలుగులో నిశ్శబ్దం గా రానుంది ఆ చిత్రం. వయసు కూడా మీద పడుతుండటంతో ఇక సినిమాలు తగ్గించి తక్కువ సినిమాలు చేస్తోంది. త్వరలోనే అనుష్క పెళ్లి కానున్నట్లు తెలుస్తోంది. బహుశా 2021 లో అనుష్క పెళ్లి ఖాయమని అంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి