సరిగ్గా 29 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన  చిత్రం

0
49
29 years compleated sajan movie

సరిగ్గా 29 సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన  సాజన్ చిత్రం  1991 ఆగస్ట్ 30 న విడుదల అయ్యింది. లారెన్స్ డిసౌజా దర్శకత్వంలో సుధాకర్ బొకాడే నిర్మించిన ఈ చిత్రంలో  సంజయ్ దత్ , సల్మాన్ ఖాన్ , మాధురీ దీక్షిత్ తదితరులు నటించారు. సాజన్ సినిమా అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఎక్కడ విన్నా సాజన్ పాటలు వినిపించేవి. సాజన్ చిత్రం మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అయ్యింది. సాజన్ చిత్రానికి ముందు ఒక హీరో కోసం ఇద్దరు హీరోయిన్ లు రొమాన్స్ చేయడానికి పోటీ పడేవాళ్ళు కానీ సాజన్ చిత్రంలో హీరోయిన్ మాధురీ దీక్షిత్ తో రొమాన్స్ కోసం సంజయ్ దత్ , సల్మాన్ ఖాన్ లు పోటీ పడటం కూడా ప్రేక్షకులకు మరింతగా నచ్చింది.

ఇక ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది పాటలు. ఇప్పటికి కూడా సాజన్ పాటలు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అద్భుతమైన పాటలు మాధురీ దీక్షిత్ అందం ఈ చిత్రానికి ఘన విజయాన్ని కట్టబెట్టాయి. అలాగే మాధురీ దీక్షిత్ , సంజయ్ దత్ , సల్మాన్ ఖాన్ ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నానంటే అంటూ అసలు కారణాన్ని తాజాగా వెల్లడించింది మాధురీ దీక్షిత్. కథ , కథనం , పాటలు అలాగే స్టార్ కాస్ట్ ఇలా అన్ని సాజన్ సినిమాకు కుదిరాయి అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అంటూ ట్వీట్ చేసింది మాధురీ దీక్షిత్.

ఇక ఇదే చిత్రాన్ని తెలుగులో డాక్టర్ రాజశేఖర్ హీరోగా అల్లరి ప్రియుడు అనే టైటిల్ తో రూపొందించారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. అప్పటి వరకు యాక్షన్ హీరోగా ముద్రపడిన రాజశేఖర్ ని లవర్ బాయ్ గా మార్చుతూ అల్లరి ప్రియుడు చిత్రాన్ని చేసాడు రాఘవేంద్రరావు. కాకపోతే హిందీలో ఒక హీరోయిన్ ఇద్దరు హీరోలు కాగా తెలుగులో రివర్స్ చేసి ఒక హీరో ఇద్దరు హీరోయిన్ లుగా మార్చాడు. ఇక తెలుగులో కూడా పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ ఉన్న రాజశేఖర్ ఏంటి ? ఈ పాటలు డ్యాన్స్ లు ఏంటి ? అని మొదటి వారంలో విమర్శలు వచ్చాయి. కలెక్షన్స్ కూడా అంతగా లేవు కానీ వారం తర్వాత ఇదే అల్లరి ప్రియుడు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డాక్టర్ రాజశేఖర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అల్లరి ప్రియుడు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి